దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా నిందితుల ఎన్కౌంటర్ ఓ కట్టుకథలా ఉందని సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వాంగ్మూలంలో తప్పులు ఉన్నాయని చెప్పేసిన కమిషన్.. వాస్తవంగా ఏం జరిగిందో చెప్పడంలో విఫలం అయిందని పోలీసుల తరఫున వాదించిన న్యాయవాది కోట కీర్తి కిరణ్ అన్నారు. మూడేళ్ల కిందట హైదరాబాద్ సమీపంలో జరిగిన దిశ అత్యాచారం హత్య అప్పట్లో కలకలం రేపింది.
ఈ ఘటనతో సంబంధం ఉన్న పదిమంది పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని కూడా నివాదికలో పొందుపరిచారు. ఈ కేసును హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేసి ఈ నివేదికపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని హైకోర్టుకు అప్పగించారు. ఈ కేసు పై నేడు మరోసారి విచారణ జరపనుంది హైకోర్టు. ఎన్కౌంటర్లో పాల్గొన్న వారిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించాలని బాధితుల తరపు పిటిషనర్ హైకోర్టును కోరారు.