శీతాకాలం విడిది కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయ సందర్శనకు వెళ్లారు రాష్ట్రపతి. ఈ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది.
రామప్పలో ఏర్పాటుచేసిన ఆన్లైన్ ఎల్ఈడి స్క్రీన్ వద్ద షార్ట్ సర్క్యూట్ తో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా పొగలు రావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పొగను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు.