కారులో అసంతృప్తి సెగలు..సీనియర్ల టార్గెట్ ఏంటి?

-

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ పరిస్తితి పైన పటారం, లోన లోటారం అన్నట్లు ఉందని చెప్పొచ్చు..కేసీఆర్ పైకి హడావిడిగా తాము తోపులమని, రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేశామని, దేశాన్ని కూడా మార్చేస్తామని తిరుగుతున్నారు…ఇక రాష్ట్రంలో ఎక్కడకక్కడ సభలు పెడుతూ…ఏదో ఎన్నికల ప్రచారం లెక్క ఊదరగొట్టేస్తున్నారు..అయితే ఇది కేసీఆర్ వర్షన్..కానీ టీఆర్ఎస్‌ అంతర్గత విషయాలకి వచ్చేసరికి చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పొచ్చు.

trs
trs

ఇప్పటికే ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది..అదే సమయంలో టీఆర్ఎస్‌లో నేతల మధ్య అంతర్గత పోరు పెరిగిపోయింది…ఇక టీఆర్ఎస్‌లో అసంతృప్తి నేతలు కూడా పెరిగిపోతున్నారు..ఇంతకాలం పదవులు రానివారు…టీఆర్ఎస్ అధిష్టానంపై గుర్రుగా ఉంటున్నారు. తాజాగా కేసీఆర్ వనపర్తిలో సభ నిర్వహించిన విషయం తెలిసిందే..ఇదే క్రమంలో అదే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు సీఎం సభకు వెళ్లకుండా, ఖమ్మం జిల్లాకు వెళ్ళి అక్కడ సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు…పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ ముగ్గురు నేతలకు టీఆర్ఎస్‌లో ఎలాంటి పదవులు దక్కని విషయం తెలిసిందే. పైగా నెక్స్ట్ ఎన్నికల్లో సీటు దక్కే విషయంలో కూడా క్లారిటీ లేదని చెప్పాలి..ఎందుకంటే గత ఎన్నికల్లో కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి జూపల్లి ఓటమి పాలయ్యారు…కానీ అక్కడ జూపల్లిపై పోటీ చేసిన హర్షవర్ధన్ రెడ్డి..టీఆర్ఎస్‌లోకి వచ్చేశారు. దీంతో అక్కడ జూపల్లి, హర్షవర్ధన్‌ల మధ్య పోరు నడుస్తోంది.

ఇటు పాలేరులో తుమ్మల నాగేశ్వరరావుకు, ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిలకు పొసగని పరిస్తితి..అటు పొంగులేటి ఎంపీ సీటుని వదులుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ ఈ ముగ్గురుకు పదవులు రాలేదు…భవిష్యత్‌లో సీట్లు వచ్చే విషయంలో కూడా డౌట్ ఉందని చెప్పొచ్చు..ఈ నేపథ్యంలోనే వీరు ముగ్గురు సమావేశం కావడం తెలంగాణ రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అయింది..మరి చూడాలి చివరికి ఈ అసంతృప్తి నేతలు ఏం చేస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news