నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జాతీయ నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమం జరుగనుంది. ఈ విషయాన్ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ ప్రకటించారు. ఒక సంవత్సరం నుండి 19 ఏళ్ల వయసు వారికి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ చేస్తామని ఆయన వివరించారు.
అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాల్లో నులిపురుగు మాత్రల పంపిణీ చేస్తామన్నారు. పిల్లల్లో నులిపురుగులు, రక్తహీనత నివారణకు ఈ మాత్రను తప్పనిసరిగా వేసుకోవాలని కోరారు. పిల్లలు తిన్న ఆహారం వంటపట్టేందుకు కూడా ఈ మాత్ర పని చేస్తుందని చెప్పారు. మధ్యాహ్నం భోజనం చేశాక ఒక మాత్రను ఒకసారి మాత్రమే వేసుకోవాలని వివరించారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్.