దీపావళికి రుచికరమైన కజ్జికాయలను ఇలా తయారు చేసుకోండి..!

దీపావళి పండుగ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. పిల్లలు మొదలు పెద్దల వరకు దీపావళి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. దీపావళి అంటే అందరికీ మొదట గుర్తొచ్చేది దీపాలు. ఇంటిని చక్కగా దీపాలతో అలంకరిస్తుంటారు. అలానే మంచిగా స్వీట్స్ ని తయారు చేసుకుంటూ వుంటారు.

దీపావళికి మీ ఇంట్లో మంచి రుచికరమైన స్వీట్ ని తయారు చేసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే ఈజీగా టేస్ట్ గా ఉండే కజ్జికాయలు రెసిపీ ని ఇప్పుడు చూద్దాం. ఇలా కనుక కజ్జికాయలు చేస్తే ఎంతో రుచిగా వస్తాయి పైగా పండగపూట ఈ స్వీట్ తో మంచిగా నోరు తీపి చేసుకోవచ్చు.

కజ్జికాయలు కి కావలసిన పదార్ధాలు:

మైదాపిండి
కరాచీ నూక
కొద్దిగా సాల్ట్
వేడి నూనె
నీళ్ళు
కొబ్బరి తురుము
పంచదార
యాలకులు

కజ్జికాయలు తయారు చేసుకునే పద్ధతి:

దీనికోసం ముందుగా పిండిలో కొద్దిగా వేడి నూనె వేసుకోండి. ఆతర్వాత కరాచీ నూక వేసుకోండి ఈ పిండిని బాగా కలుపుకోవాలి. నీళ్ల పోసుకుంటూ కలపండి. అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. ఈ పిండిని బాగా మెత్తగా కలుపుకోండి అయితే మీరు స్టఫ్ కోసం లోపల కొబ్బరి తురుము, పంచదార పొడి సిద్ధం చేసుకోవాలి. ఈ స్టఫ్ ని కజ్జికాయలు వత్తుకుని మధ్యలో పెట్టుకోవాలి వేడి వేడి నూనెలో వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈజీగా మనం కజ్జికాయలు తయారు చేసుకోవచ్చు.