వివేకా కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదే – వైయస్ షర్మిల

-

మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సుప్రీంకోర్టు పొరుగు రాష్ట్రానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. వైఎస్ వివేకా కుమార్తె సునీత రెడ్డి అభ్యర్థనను అంగీకరిస్తూ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్ లో నిష్పక్షపాతంగా ట్రయల్ సాగే అవకాశం లేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన సుప్రీంకోర్టు.. సాక్షులకు రక్షణ కల్పించాల్సిన పరిస్థితికి ఈ కేసు చేరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు స్పష్టం చేసింది.

హైదరాబాద్ లేదా ఢిల్లీకి ఈ కేసును బదిలీ చేయాలంటూ సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం న్యాయమూర్తులు జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ ఎంఎం సురేందర్ లతో కూడిన బెంచ్ విచారణ జరిపి తీర్పు రిజర్వు చేసింది. అయితే ఈ విషయంపై వైయస్ షర్మిల మాట్లాడుతూ.. వివేకా కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదేనని అన్నారు.

సునీతకి న్యాయం జరగాలని.. చిన్నన్నను అంత ఘోరంగా ఎవరు హత్య చేశారో బయటకి రావాలని అన్నారు. నిందితులకి శిక్ష పడాలన్నారు వైయస్ షర్మిల. దర్యాప్తును ఎవరు అడ్డుకోవడానికి వీల్లేదని.. రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయేమో అన్న అంశాలు సిబిఐ దర్యాప్తులో తేలిపోతాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news