కేసీఆర్ ను వెంటాడుతాం, వేటాడుతాం : డీకే అరుణ వార్నింగ్

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీఎం కేసీఆర్ ను వెంటాడుతాం, వేటాడుతామని… వార్నింగ్‌ ఇచ్చారు బీజేపీ నేత డీకే అరుణ. తెలంగాణ రాష్ట్రం లో దాన్యం కొనుగోలు చేయకుండా .. రైతులు లబోదిబో మంటుంటే…కేసీఆర్ ఢిల్లీ లో పోయి కూర్చున్నారని ఫైర్‌ అయ్యారు. దృష్టి మళ్లించేందుకు కొత్త నాటకం ఆడుతున్నారని… .నాలుగో తేదీ నుండే దళిత బందు అన్నాడు… ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని నిప్పులు చెరిగారు. రైతులకు ఒక స్పష్టత నువ్వే(కేసీఆర్) ఇవ్వకపోతివని నిప్పులు చెరిగారు.

తెలంగాణ రైతాంగాన్ని ఏమి చేయదల్చుకున్నావని ప్రశ్నించారు డీకే అరుణ. వరి వేయమని చెప్పింది కేసీఆర్ కాదా.. ఓవర్ నైట్ వరి వెయిద్దని అంటే రైతుల పరిస్థితి ఏంది..? అని నిలదీశారు. భూసార పరీక్షలు చేయించావా… ? రైతు సదస్సులు లేవు… రైతులకు అవగాహన కల్పించావా అని ప్రశ్నించారు. ఇంట గెలిచి రచ్చ గెలువు… తెలంగాణ రైతులు ఆత్మహత్య లు చేసుకుంటే కుటుంబాలను పరామర్శించలేదు… పంజాబ్ రైతుల గురించి మాట్లాడుతున్నావని నిప్పులు చెరిగారు. ఏ ప్రకటనలు అయిన రాజకీయం కోసం, ప్రచారం కోసం మాత్రమేనని… కేసీఆర్ పథకాలు పేపర్ లకు మాత్రమే పరిమితమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు రాజకీయం తప్ప చిత్తశుద్ధి లేదన్నారు.