తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పన్నుల్లో రాష్ట్రాల వాటా నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ నిధులను విడుదల చేసింది కేంద్రం. ఇందులో భాగంగానే… మొత్తం రూ. 95,082 కోట్లు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రూ.3,847.96 కోట్లు విడుదల అయ్యాయి.
అలాగే… కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రూ.1,998.62 కోట్లు విడుదల అయ్యాయి. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిధులు విడుదలతో రెండు తెలుగు రాష్ట్రాలకు… కాస్త రిలీఫ్ లభించనుంది. కాగా.. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు, ప్రాజెక్టులకు నిధులు కేటాయించక పోవడపై ఏపీ ప్రజలు మండి పడుతున్న సంగతి తెలిసిందే. అధికార టీడీపీ నేతల్లో సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతోంది. ఇక తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్తితి కాస్త మెరుగ్గా ఉండటతో.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి.