సాధారణంగా మనకి ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది. అయితే అన్ని అనారోగ్య సమస్యలు ఒకేలా ఉండవు. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలు చాలా వెరైటీగా ఉంటాయి. అందుకని ఊపిరితిత్తుల సమస్యకు సంబంధించి న్యూట్రిషనిస్ట్ కొన్ని ముఖ్యమైన విషయాలు షేర్ చేసుకున్నారు.
కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న లక్షణాలే ప్రమాదానికి గురి చేస్తాయని ఆమె అంటున్నారు. అటువంటి పరిస్థితిని రాకుండా జాగ్రత్త పడాలి అంటే కొన్ని కొన్ని సార్లు వచ్చే లక్షణాలని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని చెప్పారు. మరి ఆ లక్షణాల గురించి పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఛాతి నొప్పి:
ఛాతి నొప్పి కనుక నెలా లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉంది అంటే అది ఇబ్బందికరం అని గుర్తించండి. ముఖ్యంగా శ్వాస తీసుకునేటప్పుడు, దగ్గినప్పుడు అది బాగా విపరీతంగా ఉంటే మీరు అసలు దాన్ని నెగ్లెక్ట్ చేయకండి.
క్రోనిక్ మ్యూకస్:
మ్యూకస్ ని స్పుటుమ్ అని కూడా అంటారు. మ్యూకస్ ప్రొడక్షన్ అనేది నెల లేదా అంత కంటే ఎక్కువ రోజులు ఉన్నట్లయితే ఊపిరితిత్తుల సమస్య ఉన్నట్లు గుర్తించాలి. ఈ లక్షణాన్ని కూడా అస్సలు నెగ్లెట్ చేయద్దు.
హఠాత్తుగా బరువు తగ్గడం:
సడన్ గా మీరు కనుక బాగా బరువు తగ్గారు అంటే కచ్చితంగా ఇది పెద్ద సమస్య అని గుర్తించండి.
ట్యూమర్ లేదా మరి ఏదైనా సమస్యకి ఇది లక్షణం అవ్వచ్చు కాబట్టి ఈ చిన్న లక్షణాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు.
శ్వాస తీసుకోవడంలో మార్పు:
శ్వాస తీసుకునేటప్పుడు మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు అంటే ఖచ్చితంగా అది ఊపిరితిత్తుల సమస్య అని గమనించండి. ఊపిరితిత్తులు లోపల ట్యూమర్ ఉన్నా సరే ఈ సమస్య వస్తుంది. కాబట్టి మీరు ఈ లక్షణాన్ని కూడా అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.
దగ్గినప్పుడు రక్తం కారడం:
దగ్గినప్పుడు రక్తం రావడం ఎనిమిది వారాలు లేదా అంత కంటే ఎక్కువ రోజులు ఉన్నా ఇబ్బంది అని గ్రహించండి. ఎప్పుడూ కూడా మీ యొక్క సమస్యలను మీరు జాగ్రత్తగా గమనించాలి. చిన్న సమస్య కదా అని మీరు దానిని నిర్లక్ష్యం చేశారు అంటే ఇబ్బందులు వస్తాయని తెలుసుకోవాలి. వెంటనే డాక్టర్ ని సంప్రదించండి లేదు అంటే చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది.