తలసాని వర్సెస్ మాగంటి..హైదరాబాద్‌ ‘కారు’లో సైలెంట్ పోరు!

-

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు ఉందనే విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాళ్లో నేతల మధ్య పోరు ఉంది. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు..బి‌ఆర్‌ఎస్ లో ఉన్న నేతల మధ్య పంచాయితీ నడుస్తోంది. ఈ పంచాయితీ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. దీని వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగేలా ఉంది.

ఇదే క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ లో కూడా కనిపించకుండా ఇద్దరు అగ్రనేతల మధ్య పోరు నడుస్తోందని తెలిసింది. అది కూడా టీడీపీ నుంచి వచ్చిన నేతలమధ్య. ఆ నేతలు ఎవరో కాదు ఒకరు సనత్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మరొకరు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్. వీరి మధ్య కనిపించకుండా కోల్డ్ వార్ నడుస్తుందని తెలుస్తోంది. వాస్తవానికి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపినాథ్..అంటే అక్కడ జరిగే పార్టీ కార్యక్రమాలు ఆయనే చూసుకోవాలి.

ఇక్కడ ఏ కార్యక్రమం అయినా ఆయనే చూసుకోవాలి. కానీ ఆ ఛాన్స్ తలసాని ఇవ్వడం లేదు. జిల్లా మంత్రిగా ఉన్న ఆయన ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకుని, ఆయన పెత్తనం కొనసాగిస్తున్నారని తెలిసింది. పార్టీ సమావేశాలు, బహిరంగసభలకు జన సమీకరణ, ఆందోళన కార్యక్రమాల సమాచారాన్ని పార్టీ శ్రేణులకు మంత్రి పంపుతున్నారట. దీంతో అధ్యక్షుడుగా ఉన్న మాగంటి అసంతృప్తిగా ఉన్నారట.

పైగా జిల్లాలో రెండు, మూడు స్థానాల్లో తిరగడం తప్ప..మాగంటికి ఛాన్స్ ఇవ్వడం లేదట. కనీసం పార్టీ కార్యక్రమాలకు మాగంటి అధ్యక్షుడు స్థానంలో హాజరు కాలేని పరిస్తితి. మొత్తం తలసాని చూస్తున్నారట. దీంతో మాగంటి వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు టి‌డి‌పి నుంచి వచ్చిన వారే…అప్పుడు కూడా ఈ ఇద్దరికి సరిగ్గా సఖ్యత ఉండేది కాదు..ఇప్పుడు అలాగే ఉంది. మరి ఈ ఇద్దరిని బి‌ఆర్‌ఎస్ అధిష్టానం కలుపుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news