మీ పిల్లల ప్రవర్తన బాలేదా..? అయితే తప్పక ప్రతీ తల్లిదండ్రులు ఈ విషయాలను తెలుసుకోవాలి..!

-

పిల్లలకి సంబంధించిన ప్రతి విషయంలో తల్లిదండ్రులు ఫోకస్ పెట్టాలి. పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు..? పిల్లలు తినే ఆహార పదార్థాలు ఇలా ప్రతీ దాని గురించి కూడా తల్లిదండ్రులు పక్కాగా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకి కొత్త ప్రాంతం, వాతావరణం అసౌకర్యంగా అనిపించినా లేదంటే కొత్త వాళ్ళు వాళ్ళకి నచ్చకపోయినా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. దాంతో గట్టిగా అరవడం లాంటివి చేస్తూ అసంతృప్తిని బయట పెడుతూ ఉంటారు. అప్పటికీ తల్లిదండ్రులు పట్టించుకోలేదంటే వాళ్లకి తెలిసినవి ఎప్పుడైనా విన్నవి లేదంటే ఇంట్లో వాళ్ళు ఉపయోగించిన పదాలను ఉపయోగిస్తారు.

కొంతమంది పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులని విసిగిస్తూ ఉంటారు. వారి యొక్క ఏకాగ్రతని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలని తీవ్ర క్రమశిక్షణ విధానాలతో సరిదిద్దుకోవడం ఇందుకు కారణం అవుతుంది. అలాగే తమకు నచ్చినట్లుగా చేయకపోయినా చిన్నారుల్లో దుందుడుకు ప్రవర్తన ఉంటుంది.

సవాలుగా మారినప్పుడు లక్ష్యాలని సాధించలేకపోతున్నామని నిరాశ కలుగుతుంది. అసంతృప్తికి గురవుతారు. ఇవన్నీ తీవ్ర ఒత్తిడిగా మారి ప్రవర్తన పై ప్రభావం చూపిస్తాయి. పిల్లలకి ఎప్పుడూ తల్లిదండ్రులు ఒక భరోసాగా ఉండాలి. పెద్ద వాళ్ళ దగ్గర పరిష్కారం దొరుకుతుందని నమ్మకాన్ని కలిగించాలి. పిల్లలలో ప్రత్యేకతల్ని గుర్తించి ప్రశంసించాలి ఆత్మవిశ్వాసంతో అప్పుడు అడుగులు వేస్తారు అతిగా భావోద్వేగాలని ప్రదర్శించకుండా ముందుకు వెళ్తారు.

Read more RELATED
Recommended to you

Latest news