ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని గుర్లలో డయేరియాతో బాధపడుతున్న బాధితులను ఆయన పరామర్శించనున్నారు. డయేరియా విజృంభించడానికి గల కారణాలు అడిగి తెలుసుకుని, నివారణకు వైద్యాధికారులకు పలు సూచనలు చేస్తారని సమాచారం. ఉదయం 11 గంటలకు నెల్లిమర్ల రైల్వేస్టేషన్ సమీపంలోని ఎస్‌ఎస్‌ఆర్ పేట మంచినీటి పథకాన్ని పరిశీలించనున్నారు.
అనంతరం గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శిస్తారు.ఇక 11.30 గంటలకు గుర్ల గ్రామంలో జలజీవన్ మిషన్ పనులు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా పరిస్థితి అధికారులను అడిగి వివరాలు సేకరిస్తారు.అనంతరం స్థానిక గ్రామస్తులతో ముఖాముఖిలో పాల్గొంటారని తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు గుర్లలో బయలుదేరి కలెక్టర్ కార్యాలయానికి పవన్ చేరుకోనున్నారు.ఆ తర్వాత కలక్టరేట్ ఆఫీసులో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.