తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు, కొత్త రహదారుల నిర్మాణాలపై తెలంగాణ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో 1.320 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయాల్సి ఉండగా.. అందుకోసం రూ.1,375 వ్యయం ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఇక ఆర్ అండ్ బీ పరిధిలో 2,555 కిలీ మీటర్ల మేర రోడ్లు ధ్వంసం అవ్వగా.. రూ.2,500 కోట్లు నిధులు అవసరం అవుతాయని తేల్చింది. నియోజకవర్గాల వారీగా ఆ నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం కేంద్రం నుంచి ఫండింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సాయం కోరనుంది. ఇదివరకే కేంద్రం వరద ప్రభావిత జిల్లాల కోసం రూ.500 కోట్లకు పైగా నిధులను మంజూరుచేయగా.. ఇటీవల సీఎం రేవంత్ కేంద్ర పెద్దలను కలిసి వరదసాయాన్ని పెంచాలని కోరిన విషయం తెలిసిందే.