మీ దగ్గర చిరిగిన, కాలిపోయిన నోట్లు ఉన్నాయా? ఇలా మార్చుకోవచ్చు తెలుసా?

-

కొన్ని సార్లు చిరిగిన, లేదా కాలిపోయిన నోట్లు రావడం మనం చూస్తూనే ఉంటాం..అయితే, వాటిని ఎలా మార్చుకోవాలో తెలియక చిత్తుపేపర్ల మాదిరిగా పడేస్తారు కొందరు. మరి ఈ పాత, చిరిగిన, కాలిన నోట్లను ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి. నోట్లే కాదు, నాణేలను కూడా మార్చుకునే వెసులుబాటు ఉంది. ఇందుకు సంబంధించి తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక ప్రత్యేక ప్రకటన చేసింది. పాత నోట్లు, సగం కాలిన నోట్లు రావడాన్ని చూసి షాక్ అవుతారు.మీ పాత నోట్లు, నాణేలు ఇచ్చి కొత్త నోట్లు, నాణేలను పొందుతారు. ఈ నోట్లకు సంబంధించిన సమాచారాన్ని బ్యాంకు ట్వీట్ చేసింది. మీ వద్ద ఉన్న పాత, చిరిగిపోయిన నోట్లను మార్చుకోవాలనుకుంటే.. దగ్గరలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించవచ్చు..

ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం.. పాత, చిరిగిపోయిన నోట్లు ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులోని ఏదైనా శాఖకి వెళ్లి నోట్లను మార్చుకోవచ్చు. ఇలాంటి నోట్లని మార్చుకోవడానికి ఎవరైనా బ్యాంకు ఉద్యోగి నిరాకరిస్తే దీనిపై ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఇక్కడ మరో మెలిక ఉంది.. నోటు బాగా చిరిగిన నోట్లకు డబ్బులు కూడా తగ్గుతాయి.

ఇకపోతే నోటులో కొంత భాగం పోయినా, రెండు ముక్కల కంటే ఎక్కువ ముక్కలైనప్పుడు, దానిని అతికించి ఉన్న నోట్లని మార్చుకోవచ్చు. ఇక కరెన్సీ నోటులో సంతకం, అశోక స్తంభం, మహాత్మా గాంధీ చిత్రం, వాటర్ మార్క్ లేకుంటే ఆ నోట్లకు విలువ ఉండదు.. అవి చెల్లవు.. వాటిని బ్యాంకు స్వీకరించదు.ఇక, బాగా కాలిపోయిన నోట్లను బ్యాంకులు తీసుకోవు.. వాటిని కేవలం ఆర్బీఐ లో మాత్రమే తీసుకుంటారు.. వీటి గురించి తప్పక తెలుసుకోవాలి.. ఇక ఆలస్యం ఎందుకు నోట్లను వెంటనే మార్చుకోండి…

 

Read more RELATED
Recommended to you

Latest news