పొడవైన కాళ్ళు ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా…?

-

ప్రపంచంలోనే పొడవైన కాళ్ళు కలిగిన అమ్మాయిగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి చెందిన యువతీ నిలిచింది. టెక్సాస్‌కు చెందిన మాసి కర్రిన్ అనే అమ్మాయి ఇప్పుడు పొడవైన కాళ్ళు ఉన్న అమ్మాయిగా గిన్నీస్ రికార్డ్ సాధించారు. ఆమె తన తల్లి కంటే ఒక అడుగు ఎత్తు ఉన్నారు. ఆమె కొలతలు గిన్నీస్ బుక్ ప్రతినిధులు తీసుకున్న తరువాత… ఆమె ఎడమ కాలు 135.267 సెం.మీ (53.255 అంగుళాలు), కుడి కాలు 134.3 సెం.మీ (52.874 అంగుళాలు) అని తెలిసింది.

మాసి యొక్క ఎత్తులో 60% ఆమె కాళ్ళే అని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె వీడియో కూడా ఒకటి వచ్చింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ… “నేను ప్రీస్కూల్‌ లో అందరికంటే ఎత్తుగా ఉన్నానని మొదట గమనించాను. అందరికంటే ఎత్తుగా ఉన్నాను కాబట్టి నన్ను ఏదో భిన్నంగా చూస్తున్నారు. నేను సంవత్సరానికి నాలుగైదు అంగుళాల వరకు పెరిగా అని ఆమె చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news