ఖాళీ కడుపుతో తప్పనిసరిగా తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటో తెలుసా..?

-

ప్రతిరోజు ఉదయం మనం తీసుకొనే అల్పాహారం పైన మన రోజు ఆధారపడి ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. రోజంతా చురుకుగా ఉండాలి అంటే అందుకు తగ్గట్టుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అల్పాహారం అనేది చాలా ముఖ్యమైన భోజనం కాబట్టి ఎప్పుడూ కూడా అల్పాహారం చేయకుండా ఉండకూడదు. అల్పాహారం సమయంలో మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే ఎంచుకోవాలి. తద్వారా శరీరం రోజంతా పనిచేయడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. అలాగే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇకపోతే మీ శరీరం ఆరోగ్యంగా ఉండి జీవక్రియను పెంచాలంటే వేయించిన అలాగే అనారోగ్యకరమైన ఆహారాలను కు దూరంగా ఉండాలి.

సాధారణంగా వేసవికాలంలో శరీరంలో శక్తి తగ్గిపోయి త్వరగా అలసిపోతూ ఉంటాము. కాబట్టి వేడిని తగ్గించి శరీరాన్ని శక్తివంతంగా ఉంచడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలను అల్పాహారంలో తీసుకోవాలి. ఇకపోతే ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో తినాల్సిన కొన్ని ఆహారపదార్థాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.

జీలకర్ర నీళ్లు
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టాలి. ఇక ఆ నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు పంపి వేయబడతాయి. ఇక జీవక్రియ రేటు వృద్ధిచెందుతుంది . బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

బొప్పాయి పండు:
ప్రతి రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే బొప్పాయిని తినాలి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బొప్పాయిలో ఉండే పీచు పదార్థాలు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ముఖ్యంగా శరీరంలోని చెడు కొవ్వును బయటకు తొలగించబడుతుంది. అంతేకాదు బొప్పాయిలో ఉండే అన్ని పోషకాలు కూడా మన శరీరానికి లభిస్తాయి.

నానబెట్టిన డ్రై ఫ్రూట్స్:
జ్ఞాపకశక్తి పెరిగి, మనస్సు నిశ్చలంగా ఉండాలి అంటే కచ్చితంగా నీటిలో నానబెట్టిన బాదం పప్పు లేదా మరే ఇతర డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా జిమ్ కి వెళ్లే వారు, శరీరం ఫిట్ గా ఉండాలని చేసుకునేవారు కూడా బాదంపప్పు, వాల్నట్స్ , ఎండిన అత్తిపండ్లను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు లభించడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news