శరీరంలో లివర్ ఎంత ముఖ్యమైన పనులు చేస్తుందో తెలుసా..? అన్నీ అవయువాలకు పెద్దదిక్కు లాంటిదే..!

-

మన శరీరంలో లివర్ అనేది అతిపెద్ద కర్మాగారం. కేజీన్నర బరువు ఉండే లివర్ సుమారుగా 600 రకలా పనులను ప్రతిరోజు చేస్తుంది. లివర్ కు ఉన్న విశేషం ఏంటంటే..ఈ కేజీన్నర నుంచి కేజీ తీసేసి అరకేజీ ఉంచినా. మూడు నుంచి ఆరునెలల్లో మళ్లా ఈ కేజీ లివర్ ను తయారుచేసుకోగలదు. ఈ పార్ట్ కు ఉన్న గొప్పతనం అది..మిగతా ఏ పార్ట్ అలా చేసుకోలేదు. అంటే అంత పాడు చేసినా..మళ్లీ కరెక్టు ఫుడ్ అందిస్తే..లైన్ లో పడతదనమాట.

లివర్ మన శరీరంలో సవ్యంగా పనిచేస్తే అసలు మనకు ఎంత మేలు చేస్తుందో తెలుసా..ఈ పొల్యూటేడ్ ప్రపంచంలో కూడా మనం హాయిగా బ్రతికేటట్లు చేసే ఒకే ఒక్క పార్ట్ లివర్. ఎరువులు, పురుగుమందులు, కార్భైట్, సిగరెట్, ఆల్కాహాల్, గంజాయి, ఒక్కపొడి, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ , చాక్లెట్స్ వీటన్నింటి తయారీలోకి వెళ్లిన కలర్స్, ఫ్రిజర్వేటీస్ వీటితోపాటు మనం జబ్బులు వచ్చినప్పుడు మందులు మింగుతుంటాం..ఆ మందుల దోషాలు , నీటి కాలుష్యం, వాయి కాలుష్యం..వీటన్నింటి నుంచి బాడీని రక్షించి డీటాక్సిఫై చేసి మనిషిని ఆరోగ్యంగా ఉంచుంతుంది లివర్. లివర్ కాస్త డల్ అయిందంటే..మనకు రోగాలు వస్తాయి. ఇది చురుగ్గా పనిచేస్తే..ఏ రోగాలు ఉండవు. అన్నింటికి సరైన పోషకాలు అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది.

లివర్ చేసే పనులు

పొట్టభాగంలో కుడివైపు లివర్ ఉంటుంది. దానికి దిగువన గాల్ బ్లాడర్ ఉంటుంది. ఇది పసరతిత్తి..90ML పైత్యరసాన్ని నిల్వ చేసుకుంటుంది ఇది. లివర్ ఆహార పదార్థాలను అరిగించడానికి పైత్యరసాన్ని తయారుచేస్తుంది..దీన్నే బైల్ జ్యూస్ అంటారు. ఈ పైత్యరసంలో కొవ్వులను అరిగించటానికి ఉపయోగపడే ఎంజైమ్స్ ను, రసాలను పెడుతుంది. టాక్సిన్ ను కూడా ఈ పైత్యరసంతోనే కిందకు పంపిస్తుంది. లివర్ నుంచి ఉత్పత్తి అయిన ఈ పైత్యరసం గాల్ బ్లాడర్ లో స్టోర్ అయి అవసరమైనప్పుడు ప్రేగుల్లోకి వస్తుంది. ఈ లివర్ డైజెషన్ చేయడానికి, టాక్సిన్స్ బయటకు వదలడానికి ఈ పైత్యరసం ద్వారా చేస్తుంది.

లివర్ నాలుగు రకాల విటమిన్లను ఆరునెలల నుంచి సంవత్సరం వరకు స్టోర్ చేసుకుంటుంది. విటమిన్ A, D, E, K లివర్ స్టోర్ అవుతాయి. రక్తం గడ్డకట్టే పనిచేసేది లివరే. విటమిన్ కే ద్వారా చేస్తుంది. లివర్ కొలెస్ట్రాల్ ను తయారు చేసుకుంటుంది. బాడీకి కావలిసిన కొలెస్ట్రాల్ అంతా లివర్ లోనే స్టోర్ అవుతుంది. మనకు బాడీలో కొన్ని ప్రోటీన్స్ తయారుచేస్తుంది. లివర్ పనిచేయకపోతే..ఎలా అయితే..కుండకు చిల్లుపడితే..నీళ్లు కారుతాయో..అలా లివర్ నుంచి బ్లడ్ వెళ్లిపోతుంది.

లివర్ వల్లే రక్తం గడ్డకడుతుంది. విటమిన్ b12ను స్టోర్ చేస్తుంది. అలాగే మనం తిన్న ఆహార పదార్థాల ద్వారా వచ్చిన ఈ పోషకాలు అన్నీ బాడీలోకి వెళ్లాలంటే..ఫస్ట్ లివర్ లోకి వెళ్తాయి. మన ఆహారంలో పొట్టప్రేగులు చంపాక ఇంకా ఏమైన దోషాలు ఉంటే..లివర్ లో ఉండే కుఫర్ సెల్స్ వాటిని క్లీన్ చేస్తాయి. ఆహారంలో ఏ క్రిములు లేకుండా..ఏం ఇబ్బంది లేదనుకున్నప్పుడు ఆ పోషకాలను గుండెకు పంపుతుంది..గుండె అక్కడ నుంచి పంప్ చేస్తుంది. భలే ఉంది కదా..మనం ఎలా అయితే..చిన్నపిల్లలకు ఆహారం పెట్టేముందు..అది ఎలా ఉందో కాస్త తిని బాగుందో లేదో చెక్ చేసి..అంతా ఓకే అనుకుంటేనే పసిపిల్లలకు పెడతాం. అలా అంతా ఓకే అనుకుంటే..లివర్ గుండెకు ఇస్తుంది.

పురుగుమందులు, కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకున్నప్పుడు కూడా లివర్ ముందు ఆక్సీకరణం చేసి విడగొట్టేస్తుంది. తర్వాత వీటిని నిర్వీర్యం చేస్తుంది. ఆ తర్వాత రక్తం గుండా పంపించి మూత్రం గుండా 80 శాతం, కొంత పైత్యరసం గుండా పెట్టి మలంగుండా పోయేట్లు చేస్తుంది. వీటన్నింటిని లివర్ ఈ రకంగా క్లీన్ చేస్తుంది.

మనం పగలు పనిచేసి రాత్రి పడుకుంటాము..అలాగే మన శరీరంలో పొట్టప్రేగులు, కొన్ని పార్ట్స్ కూడా రెస్ట్ తీసుకుంటాయి. కానీ లివర్ కి మాత్రం 24గంటలు పనే..ఆహారం ఉన్నంత సేపు అరిగించే పనిచేస్తుంది. ఆహారం అయిపోయాక తెల్లవార్లు బాడిలో ఉండే టాక్సిన్స్ అన్నీ తీసుకొచ్చి బాడీ లివర్ లో వదిలేస్తుంది. లివర్ వీటన్నింటిని శుద్దిచేసి మీ బాడీని, బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. టోటల్ డీటాక్సిఫై చేసే అవయువం లివర్.

ఇలాంటి అద్భుతమైన పనులన్నీ బాడీలో ఏ పార్ట్ చేయలేదు. పాపం ఇంత కష్టపడి పనిచేస్తన్న లివర్ కు మనం ఆల్కాహాల్ పెడతాం. అది మత్తుఎక్కి పడుకుంటుంది. అప్పుడు ఈ పనులు అన్నీ ఆగిపోతాయ్ కదా. ఇక టాక్సిన్ అన్నీ పేరుకుపోతాయి. కాఫీలో ఉండే కెఫిన్ కూడా డైరెక్టుగా బ్లడ్ లో ఎక్కిస్తే..ప్రాణంతకమే..ఈ మందులన్నింటిని బాడీలోకి వెళ్లకుండా..లివర్ ఆపుకుని..కొద్దికొద్దిగా రక్తంలోకి పంపుతుంది.

లివర్ ను పాడుచేసే ఆహారపు అలవాట్లు

ఆల్కాహాల్ తాగడం వల్ల లివర్ బాగా డామేజ్ అవుతుంది. నూనె పదార్థాలు ఎక్కువగా లివర్ ను ఇబ్బంది పెడతాయి. వీటితో పాటు యసిడిక్ ఫుడ్స్. బాడీలో ఉండే పీహెచ్ అంతటిని రెగ్యులేట్ చేసేది లివరే..బాడీలో ఆమ్లత్వం పెరగకుండా..క్షారత్వాన్ని కరెక్టుగా బ్యాలెన్స్ గా ఉంచుకునేది లివరే. మనం శాలరీ ఇస్తేనే జాబ్ చేస్తాం..మరీ లివర్ కు ఈ పనులన్నీ చేయాలంటే..కావాల్సింది..విటమిన్లు, పోషకాలు. మనం ఇలాంటివి ఇవ్వకపోగా..కూల్ డ్రింక్స్, పంచదార, వైట్ పాయిజన్ ప్రొడెక్ట్స్ లాంటివి ఎక్కువ పెట్టమనుకోండి..లివర్ తట్టుకోలేదు.

మన రక్తంలో చెక్కర ఒకేసారి పెరిగిపోకుండా నియంత్రించేది లివరే. డౌన్ అయినప్పుడు కళ్లుతిరిగి కిందపడుకుండా కాపాలాకాసేది లివరే. తీసుకున్న ఆహారం ఎక్కువైనప్పుడు కొవ్వుగా మార్చేది లివరే. ఆహారం తిన్నప్పుడు కొవ్వును కరిగించి మళ్లీ రక్తంలోకి చెక్కరను విడుదల చేసేది లివరే. మరి ఈ పనులన్నీ చక్కగా చేసుకోవాలంటే..దానికి ఇష్టంలేని నూనె పదార్థాలు, ఆల్కాహాల్ పెట్టకూడదు. ఫ్రిజర్వేటీస్ తో కూడిన పదార్థాలు..లివర్ పనులను చేయినివ్వకుండా అడ్డుపడతాయి. గుట్కాలు, జరదాలు, సిగిరెట్లు, టీ, కాఫీలు ఇవన్నీ లివర్ కు నష్టమే.

మనకున్న వ్యసనాలు లివర్ ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే..

ఊబకాయం ఉన్నవారికి..లివర్ కు కూడా ఫ్యాట్ పట్టేసి ఫ్యాటీలివర్ గా అవుతుంది. ఎన్ లార్జడ్ లివర్, కొవ్వు ఎక్కువైపోయి..గట్టిపడుతుంది.. హార్డెన్ లివర్ గా మారుతుంది. సిర్రోసిస్ గా మారుతుంది..ఇది ప్రమాదకరమై స్థితి. కొందరికి ఆల్కాహాల్ తాగితే వస్తుంది. కొందరికి తాగకున్నా సిర్రోసిస్ వస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. లివర్ కి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి కామెర్లు రావడం. ఇలాంటివి అన్నీ లివర్ కు వచ్చే జబ్బలు. మన అలవాట్లు మార్చుకుంటే..లివర్ మల్లా రివర్స్ అయి..వీటన్నింటిని తగ్గించుకని మళ్లీ హెల్తీగా మారగలదు. లివర్ కు ఉన్న గొప్ప గుణం అది. సాధారణంగా బాడీలో ఏ పార్ట్ అయినా పాడైతే..మనం మళ్లీ ఆరోగ్యంగా ఉండేలా చేసినా..మునపటి అంత ఆరోగ్యంగా ఉండలేవు. కానీ లివర్ అలా చేసుకోగలదు.

లివర్ ను కాపాడుకోవాలనుకుంటే..ఉండాల్సిన ఆహార నియమాలు

లివర్ కు బాగా హెల్ప్ చేయాలంటే..సాయంత్రం 7 గంటలకల్లా డిన్నర్ తినేసేయాలి. నైట్ డెజెషన్ పని లివర్ కు పెడితే..రిపేర్ క్లీనింగ్ పని ఆగిపోతుంది.కుదిరితే..పండ్లు,ఎండువిత్తనాలతోనే డిన్నర్ కంప్లీట్ చేసుకుంటే మరీ మంచిది.

వారానికి ఒక్కరోజు లివర్ కు సెలవు ఇవ్వాలి. అంటే ఒకరోజు ఫాస్టింగ్ ఉంటే..ఆరోజు ఎరువులు, పురుగుల మందులు దోషాలన్నింటిని లివర్ బాగా క్లీన్ చేసుకుంటుంది. ఏ రోజు ది ఆ రోజు నైట్ చేసుకుంటుంది. కానీ పెండింగ్ ఉండిపోతాయి. అలా వారంలో మిగిలిన వ్యర్థాలన్నింటిని క్లీన్ చేయాలంటే .మనం ఏం పంపకుండా ఉంటే..లివర్ ఆ పని చేసుకుంటుంది. అందుకే పూర్వకాలంతో ఉపవాసం కాన్సెప్ట్ పెట్టారు.

రోజులో 50శాతం అయినా వండకుండా వండే ఆహారం తినడానికి ట్రై చేయండి. వార్చిపిండకుండా ఉండే ఆహారాలు ఎంత ఎక్కువగా తీసుకుంటే లివర్ అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఇలాంటి పోషకవిలువతో కూడిన ఆహారం ఇస్తే లివర్ 150 ఏళ్లు పనిచేస్తుందట.

రోజుకు నాలుగు ఐదు లీటర్లు వాటర్ తాగాలి. పీహెచ్ మెయింటేన్ చేయాలంటే శరీరంలో సరిపడా వాటర్ కావాలి. లివర్ క్లీన్ చేసిన దోషాలు అన్నింటిని బయటకు పంపాలి అన్నా వాటర్ కావాలి.

ఈ నియమాలు పాటించి..మీరు లివర్ కు సాహయం చేస్తే..అది మీకు మేలు చేస్తుంది.

– Triveni Buskarowtu

Read more RELATED
Recommended to you

Latest news