బిర్యానీ అంటే మనకు ఎంత ఇష్టమో కదా. అసలు బిర్యానీ అంటే ఆ వాసనకే సగం కడుపునిండుతుంది ఏంటో. అందులో వాడే మసాల దినుసులు ఉంటాయ్ వేయగానే.. ఎంత గుమగుమలాడిపోతాయో. చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా..బిర్యానీ ఆకులు వేయాల్సిందే. బిర్యానీ ఆకుతో ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
సువాసనగల బిర్యానీ ఆకుల టీ ప్రతి రోజూ తాగడం వల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధులతో పాటు అనేక రకాల వ్యాధుల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది.
డయాబెటీస్ , గుండె రక్తనాళాల పనితీరు మెరుగుపర్చటంలో, ఇంఫ్లమేషన్ తగ్గించటంలో ఈ ఆకు చాలా బాగా ఉపకరిస్తుంది.
బిర్యానీ ఆకుల్లో సహజంగా ఉన్నటువంటి యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ప్రమాదకర బ్యాక్టీరియా వైరస్ వల్ల వచ్చే ఫ్లూ, శ్వాసకోశ వ్యాధులు, గొంతు నొప్పి సమస్యలను దూరం చేస్తుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సాధారణ కీళ్లనొప్పులతో పాటు ఆర్థరైటిస్,రుమటాయిడ్ వంటి దీర్ఘకాల వ్యాధులను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.
బిర్యానీ ఆకుల్లో ఫైటో న్యూట్రియెంట్స్ ఉండడంవల్ల వీటిని ప్రతిరోజూ కషాయంగా తీసుకుంటే మన శరీరంలోని క్యాన్సర్ కారకాలతో సమర్థవంతంగా పోరాడతాయి. కొలన్ క్యాన్సర్, అబ్డామినల్ క్యాన్సర్, వంటి వాటి నుండి బయటపడవచ్చు. జీర్ణ సమస్యలను తొలగిస్తుంది.
కొలెస్ట్రాల్‌ను తగ్గించటంలోనూ బాగా ఉపయోగపడతాయి.
ప్రతిరోజు క్రమం తప్పకుండా బిర్యానీ ఆకుల టీ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ,అధిక కేలరీలని త్వరగా కరిగించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
బిర్యానీ ఆకులో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల బిర్యానీ ఆకుల్లో 180 గ్రాముల ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. శరీరంలో జీవక్రియలు సక్రమంగా సాగడానికి ఇది సహాయపడుతుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో, ప్రసవానంతరం కడుపులో బిడ్డకి, గర్బిణీ స్ర్తీకి ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. గర్భిణీలు వంటకాల్లో బిర్యానీ ఆకు చేర్చుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.
అతి బరువు, ఊబకాయం వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. డైలీ బిర్యాని ఆకును నానపెట్టిన వాటర్ తాగటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుతుంది. బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగేలా చేయటంలో , హైపర్ టెన్సన్ నుండి విముక్తి పొందవచ్చు.
బిర్యానీ ఆకులో ఉండే…విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు, చర్మానికి ఉపయోగపడతాయి.మొటిమలు తగ్గించడంతోపాటు, స్కిన్‌ను తాజాగా మారుస్తుంది.
చుండ్రు నివారించి, పేలును తొలగిస్తుంది. విటమిన్ ఎ లోపంతో బాధపడేవాళ్లు బిర్యానీ ఆకులను ఒక పూట ఆహారంలో చేర్చుకుంటే కంటిచూపు సమస్యలు ఉండవు.
కాబట్టి బిర్యాని ఆకును పొడిచేసి లేదా కూరల్లో ఉపయోగించటం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి.