బండి సంజయ్ అరెస్ట్ పై కరీంనగర్ సిపి సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. మిటింగ్ లకు ఎటువంటి పర్మిషన్ లు లేవని… జీవో ఎమ్ ఎస్.1 ఆమల్లో ఉందన్నారు. సెంట్రల్ ప్రభుత్వం,స్టేట్ ప్రభుత్వం తెలిపిన కోవిడ్ నిబంధనలు మేరకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు వచ్చాయని… ఇటీవల ఒమిక్రాన్ కేసులు పెరిగాయన్నారు. సభలు సమావేశాలకు పర్మిషన్ లు లేవని… జాగరణ దీక్ష కు అనుమతి లేదని పేర్కొన్నారు. నిన్న మధ్యాహ్నం జాగరణ కార్యక్రమం పెట్టవద్దని నోటీసులు ఇవ్వడం జరిగిందని… చాలా ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున జనం గుమిగూడడంతో చాలా మందిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.
కొంత మంది యువకులు వాహనాలపై దాడి చేశారు పోలీసులపై దాడులకు పూనుకున్నారని మండిపడ్డారు. ఎన్నో సార్లు ఎంపీ బండి సంజయ్ కు నాయకులకు కార్యక్రమం వద్దని తెలపడం జరిగిందని… పోలీస్ ల విధులకు ఆటంకం కలగించారన్నారు. 25 మందిపై మాస్కులు లేవని కేసులు పెట్టామని… కావాలని జాగరణ కార్యక్రమం తలపెట్టి పోలీసులపై దాడి తెగబడ్డ 16 మందిపై 188,330,180 డిజాస్టర్ కేసులు పెట్టాం అందులో బండి సంజయ్ పై కూడా కేసులు నమోదు చేసామని పేర్కొన్నారు. ఇప్పటికి కాగా 5 మందిని అదుపులో కి తీసుకున్న… మిగతా 60 మందిని విడుదల చేసి నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. సభలు సమావేశాలకు ప్రస్తుత తరుణంలో అనుమతులు ఇవ్వమని..
ఎంపీ బండి సంజయ్ ను మరికొద్ది సేపట్లో కోర్టుకు తరలిస్తామని చెప్పారు.