స్నానం చేసే నీటిలో వీటిని కలిపి చేస్తే ఎన్ని సమస్యలు దూరం అవుతాయో తెలుసా?

-

కొన్ని విషయాలను కొందరు బలంగా నమ్ముతారు.. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రాన్ని చాలా మంది ప్రజలు నమ్ముతారు. ఆరోగ్యం, వృత్తి, సంపద, కుటుంబ క్షేమం కోసం పూజలు యజ్ఞలు కూడా చేస్తూ ఉంటారు..అదృష్టం ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. డబ్బు, విజయం, కీర్తి సాధించడంలో మరింత సహాయపడే అదృష్టాన్ని పొందడం కోసం ఎక్కువ మంది జ్యోతిష్యన్ని నమ్ముతుంటారు. చేతికి ఉంగరాలు ధరించడం, బ్యాగుల్లో అదృష్టం తీసుకొచ్చే వస్తువులను పెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాము..

అదే విధంగా ఇప్పుడు మీరు స్నానం చేసేటప్పుడు వీటిని నీళ్లలో కలుపుకుంటే అదృష్టం మీ వెంటే అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.ముఖ్యంగా చెప్పాలంటే భారతీయులు వంటకాల్లో ఉపయోగించే అత్యంత సాధారణమైన పదార్థం పసుపు. భగవంతుడిని ఆరాధించడం దగ్గర నుంచి జలుబు తగ్గించే వరకు అన్ని విధాలుగా పసుపు ఉపయోగపడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్నానం చేసే నీటిలో పసుపుని కలపడం వల్ల అదృష్టం, శ్రేయస్సు, చికాకులు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు..

ఈ పసుపును యాంటి బయ్యాటిక్ గా కూడా వాడుతారు..శరీరం నుంచి ప్రతికూల శక్తులను తొలగిస్తుందని కూడా చాలామంది చెబుతారు. ఇంకా చెప్పాలంటే గంధం నూనె లేదా గంధపు పొడిని స్నానం చేసే నీటిలో కలపడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. సానుకూలతను పెంచుతుంది. ఒంటికి చలువ చేస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు. ఇంకా చెప్పాలంటే గులాబీ రేకులు అద్భుతమైన సువాసన ను కలిగి ఉంటాయి. చర్మ సంరక్షణ ప్రయోజనాల కోసం ఎన్నో దశాబ్దాలుగా గులాబీ రేకులను ఉపయోగిస్తూ వస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గులాబీ రేకులు ప్రేమ, ఆనందం, విజయాన్ని ఇస్తాయని చాలా మంది ప్రజలు నమ్ముతారు.. అలా చెయ్యడం వల్ల ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు.. చూసారుగా ఎన్ని లాభలో ట్రై చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news