రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరెడ్డి పేరు తెలియని వాళ్లుండరు అంటే అతిశయోక్తి కాదు. శ్రీ రెడ్డి వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తూ పాపులారిటీ సంపాదించుకుంటారు. అలా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారి పేరు సంసాదించుకుంది. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ అనే అంశం తెరపైకి తీసుకువచ్చి సంచలనం సృష్టించింది. అంతే కాకుండా ఫిల్మ్ ఛాంబర్ ముందు పై దుస్తులు విప్పి నానా రచ్చ చేయడంతో నేషనల్ మీడియాలో సైతం శ్రీరెడ్డి పేరు మారుమోగిపోయింది.
ఏకంగా టాలీవుడ్ అగ్ర నిర్మాత తనయుడు తనతో వాళ్ల స్టూడియోలోనే శృంగారంలో పాల్గొన్నాడని.. అవకాశాలు ఇప్పిస్తానని తనను మోసం చేశాడని సంచలన ఆరోపణలు చేసింది. తర్వాత పలువురు స్టార్ హీరోలపై కూడా ఈ అమ్మడు దారుణమైన కామెంట్స్ చేయడంతో బహిష్కరించారు. ఆ తర్వాత కొన్ని గొడవలు జరిడంతో చెన్నైకి చెక్కేసింది. అడపాదడపా హైదరాబాద్‌కు వచ్చి పనులు చక్కబెట్టుకొని వెళ్తుంది. ఈ మధ్య డిప్రెషన్లోకి వెళ్లి మళ్లీ కోలుకున్న శ్రీరెడ్డి ఇప్పుడు హైదారాబాద్‌కు తన మకాం మార్చింది. దీంతో మళ్లీ ఆమె మార్క్ స్టైల్ ఇంటర్వ్యూలు మొదలు పెట్టింది.
ఈ మధ్య కాలంలో విలేజ్ స్టైల్ వంటకాలతో గరిటె తిప్పుతూ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. తన ఫాలోవర్స్‌ను ఎప్పటికప్పుడు పెంచుకుంటుంది. ఒకప్పుడు ఆమెను చీదరించుకునే వాళ్లే శ్రీరెడ్డి వంటకాలకు లొట్టలేస్తున్నారు. అయితే శ్రీరెడ్డి రియల్ పేరేంటి? శ్రీరెడ్డిగా ఎలా మారింది వంటి విషయాలను తెలిపింది.
శ్రీరెడ్డి నేనే, శ్రీలేఖ నేనే, సాక్షి ఛానల్‌కు వచ్చిన తర్వాత లేఖ పీకేసీ రెడ్డి పెట్టేశారంటూ నవ్వుతూ చెప్పింది. అయితే వెంటనే రిపోర్టర్.. రెడ్డిగారి ఛానల్‌కు వస్తే రెడ్డివి అయిపోయావా అని అడిగాడు. ఈ ప్రశ్న అడిగిన మీకు సాక్షిన పని చేస్తున్న వాళ్లకి నేను రెడ్డినని తెలుసు.. నా ఆధార్ కూడా చూపించాను మీరు కూడా చూస్తారా… అని ఛాలెంజ్ విసిరింది