ఈ ఆకుల్లో భోజనం చేస్తే లాభాలో ఎన్నో తెలుసా ?

-

సంప్రదాయ భోజనం అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది.. పచ్చటి ఇస్తరాకులో లేదా అరటి ఆకులోనే షడ్రసోపేత భోజనం. రకరకాల పదార్థాలు కంటికి, నాసికకేకాకుండా నాలుకకూ ఇంపుగా ఉండే పదార్థాల సమాహారం అని. అయితే భోజనాన్ని ఇత్తడి, స్టీల్‌, ప్లాస్టిక్‌ ప్లేట్లలో కాకుండా ఫ్రెష్‌గా ఎప్పటికప్పుడు అకుపచ్చని కింద చెప్పిన ఆకుల్లో తింటే ఎన్నో ఉపయోగాలు. పూర్వకాలం నుంచి మనదేశంలో ఉన్న సంప్రదాయం..

ఆరోగ్యం, పర్యావరణ హితమైన పద్ధతి. ఆయా పదార్థాలను…అరటి, రావి, మోదుగ, మర్రి, వంటి పచ్చటి చెట్ల ఆకుల్లో భోజనం అన్ని రకాలుగా శుభకరము, ఆరోగ్యకరము అని ఆయుర్వేదం చెబుతోంది. ఆరోగ్య శాస్త్రాలు, పురాతన శాస్త్రాలు అనుసరించి, అరటి ఆకులలో భోజనం ఉత్తమమని తెలుపుతున్నాయి, చెట్ల ఆకుల్లో ఔషధ గుణాలుంటాయి, అవి శరీరానికి ప్రత్యేకంగా, కానీ పరోక్షంగా ఎంతో మేలు చేస్తాయి. రావి ఆకులో భోజనం చేస్తే జననేంద్రియ దోషాలు పోతాయి చిన్న పిల్లలకు చక్కటి మాటలు వస్తాయి, మోదుగ విస్తరిలో భుజిస్తే నేత్ర దోషాలు తొలగుతాయి.

ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉగాది రోజున చేసే భక్షాలను మోదుగ ఆకులో తినడం ఆనవాయితీగా వస్తోంది. మర్రి ఆకులతో కుట్టిన విస్తరిలో భోజనం చేస్తే పూర్తి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అందుకే దేవతలకు పెట్టె నైవేద్యాన్ని మర్రి ఆకుల విస్తరిలో నివేదించడం జరుగుతుంది. పచ్చటి ఆకుల్లో భోజనం చేస్తే ఆకుల్లోని క్లోరోఫిల్ ఉండడం వలన అనేక రుగ్మతలు, పేగుల్లోని క్రిములు దూరమవుతాయి.

ఈ విషయాలను గమనించిన మన పూర్వీకులు అప్పట్లోనే శాస్త్రీయ పద్దతులను అనుసరించి, పచ్చన చెట్లు మద్య కార్తీక మాసంలో ఒక నెల రోజుల పాటు వనభోజనాలు చేయడం మంచిదని తెలిపారు, మనం కనీసం ఒక రోజు అయినా భోజనాలు చేసి ఆరోగ్యన్ని కాపాడుకుందాం. సంస్కృతి, ఆచారాలను పరిరక్షించుకునే క్రమంలో హై టెక్ సిటీల్లో సైతం వన భోజనాలను నిర్వ్హఅహినుకోవడం ముదాహం. ఇందుకు మహా నగరాల్లో జరుగుతున్నా సామూహిక భోజనాలనే నిదర్శనం.

సాధ్యమైనంత వరకు పచ్చటి ఆకుల్లో భోజనం చేయడానికి ప్రయత్నం చేస్తే మంచిది. వీలైతే పెరట్లో అరటి చెట్టు, తోటల్లో మర్రి, మోదుగ చెట్టులను పెంచుకుని వాటి ఆకుల్లో భోజనం చేస్తే ఆరోగ్యానికి, పర్యావరణానికి హితం.

Read more RELATED
Recommended to you

Latest news