18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్ కార్డుని ఇస్తారు. అలానే ఆధార్ కార్డు ప్రతీ ఒక్కరికి ఉంటుంది. ఇది మనకి వుండే కీలక డాక్యుమెంట్స్ లో ఒకటి. ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క పథకానికి ఆధార్ కార్డు చాలా అవసరం. లేదంటే స్కీమ్స్ లో చేరలేరు. అయితే సాధారణంగా పాన్ కార్డ్, రేషన్ కార్డ్ వంటి వాటికి ఆధార్ లింక్ చేస్తూ ఉండటం మనకి తెలుసు.
అయితే ఇక నుండి ఓటర్ కార్డుని కూడా ఆధార్ తో లింక్ చెయ్యాలి. అయితే ఆధార్ ఓటర్ ఐడి అనుసంధానం చేయడం వల్ల ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలను మనం చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ బిల్లును న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టగా, ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఎన్నో నిరసనలు చేపట్టాయి.
మరి ఎలాంటి లాభాలని పొందొచ్చు అంటే..? ఇప్పుడు ఎవరైనా ఓ గ్రామం నుండి నగరానికి వలసి వెళ్లి అక్కడే స్థిరపడు ఉంటే ఓటర్ కార్డు అనుసంధానం చేయటం వల్ల ఆ వ్యక్తి నగరంలో ఓటు వేయడం మాత్రమే జరుగుతుంది. లేదు అంటే రెండు చోట్ల కూడా ఓటు వేసేస్తూ వుంటారు.
అదే ఒకవేళ కనుక ఆధార్ తో ఓటర్ కార్డుని లింక్ చేస్తే అప్పుడు రెండు చోట్ల ఓటు వెయ్యకుండా చెయ్యడానికి అవుతుంది. అందుకోసమే ఓటర్ కార్డ్ ఆధార్ అనుసంధానం చేయాలని బిల్లును తీసుకు రావడం జరిగింది.