దసరా పండుగ చరిత్ర మీకు తెలుసా..?

-

హిందువులు ప్రధానంగా జరుపుకునే పండుగల్లో దసరా కూడా ఒకటి. ఆశ్వయుజ మాసంలో మొదటి తొమ్మిది రోజులను శరన్నవరాత్రులు అంటారు. అయితే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని తొమ్మది రూపాల్లో అలంకరిస్తారు. అలానే ఈ తొమ్మిది రోజుల్లో ప్రతీ రోజు కూడా వివిధ పదార్ధాలతో నివేదన చేస్తారు.

దసరా పండుగ చరిత్ర:

మహిషాసురుడు అనే రాక్షసుడు పూర్వం ఉండేవాడు. మహిషము అంటే దున్నపోతు. ఈ ఆకారంలో రాక్షసుడు ఉండడం వలన అతన్ని అలా పిలిచేవారు. అతను ముల్లోకాలను జయించాలనే దురుద్దేశం తో ఉండేవాడు. బ్రహ్మని తప్పదు తో ప్రసన్నం చేసుకున్నాడు.

ఏ పురుషుని చేతిలోనూ మరణం లేకుండా వరాన్ని పొందాడు. ఇంకా హింసించడం మొదలెట్టేడు రాక్షసుడు. త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు ఇది గమనించి స్త్రీ శక్తి రూపాన్ని సృష్టించారు. ఆ శక్తే దుర్గా దేవి. 18 చేతులు గల దుర్గా దేవి ఇంద్రుడి నుండి వజ్రాయుధం, విష్ణువు నుండి సుదర్శన చక్రం, శివుడి నుండి త్రిశూలాన్ని ఆయుధాలుగా పొందింది.

సింహాన్ని వాహనంగా చేసుకుంది. తొమ్మిది రోజులు యుద్ధం చేసి గెలిచింది. అందుకే తొమ్మిది రోజులను మనం నవరాత్రిగా జరుపుకుంటాం. పదవ రోజును విజయానికి చిహ్నంగా విజయ దశమి జరుపుకుంటాము. ఇది ఒకటైతే మరో రెండు కారణాలు కూడా వున్నాయి. అవి కూడా చూద్దాం.

రామాయణ గాధ ప్రకారం రాముడు రావణాసురుడిని వధించిన రోజుగా ఈ పండుగ జరుపుకుంటామని అంటుంటారు.
మహా భారతంలో పాండవులు తమ వాన వాసాన్ని పూర్తి చేసుకుని ఆయుధాలను జమ్మి చెట్టుపై నుండి తీసుకున్న రోజుగా భావిస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news