టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హరికృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగపెట్టిన ఈయన తండ్రికి తగ్గ తనయుడిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. నిన్ను చూడాలని సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైన ఎన్టీఆర్ ఆ తర్వాత సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ వన్ , యమదొంగ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఇక ఏ సినిమాలో నటించినా సరే తన మేకోవర్ ను చేంజ్ చేసుకుంటూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా అందుకు నిదర్శనమని చెప్పాలి.ముఖ్యంగా ఒక సినిమా విషయంలో ఎంత డెడికేటివ్గా పనిచేస్తారో అంతే ఎనర్జిటిక్ గా పనిచేస్తారని చెప్పవచ్చు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా కోసం ఆయన తన రెండు సంవత్సరాల కెరియర్ ను అంకితం చేశాడు అంటే ఆయన సినిమాలపై ఎంత డెడికేటివ్ గా పనిచేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని విషయాలలో ఇష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి పాటలు వినడంలో ఇష్టం ఉంటే మరి కొంత మందికి రుచికరమైన భోజనం చేయడం ఇష్టం ఉంటుంది . ఇక ఈ క్రమంలోని ఎన్టీఆర్కు ఒక పాట అంటే చాలా ఇష్టమట. ఎంతలా ఇష్టం అంటే తన స్మార్ట్ ఫోన్ తన దగ్గర ఉంటే చాలు ఎక్కువగా తన మొబైల్ సాంగ్ ప్లే లిస్టులో ఆ పాటనే ఎక్కువగా వింటూ ఉంటారు అని ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ టైం లో వెల్లడించడం జరిగింది.ఇక ఆ సినిమా పాట C/o కంచరపాలెం. ఆశా పాశం బందీ సేసెలే..సాగే కాలం ఆటే ఆడేలే.. ఈ పాట అంటే తనకు చాలా ఇష్టమట. అంతేకాదు ప్రమోషన్స్ లో భాగంగా ఈ పాటను ఆయన స్వయంగా పాడి మరీ వినిపించారు. ఇకపోతే కేరాఫ్ కంచరపాలెం సినిమా న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో మే 2018 లో ప్రదర్శించబడింది. అంతే కాదు ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ లో కూడా ప్రదర్శించడం తో పాటూ ఉత్తమ చలనచిత్ర అవార్డును సొంతం చేసుకోవడం గమనార్హం.