దర్శక ధీరుడు రాజమౌళి దేశం మెచ్చిన దర్శకుడు అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న నేపథ్యంలో మన డైరెక్టర్లకు మంచి డిమాండ్ కూడా పెరిగింది. ఇకపోతే రాను రాను కథ మారుతుంది..ఇప్పుడు పాన్ ఇండియా కాదు ఏకంగా పాన్ వరల్డ్ మూవీస్ రాబోతున్నట్లు వార్తలు వైరల్ అవ్వడమే కాదు మన తెలుగు చిత్రాలు ఇప్పటికే హాలీవుడ్ ప్రేక్షకులను కూడా కట్టిపడేస్తున్నాయి. ఇక అలా కట్టిపడేస్తున్న దర్శకుడికే ఒక అరుదైన గౌరవం దక్కబోతోంది. ఇక ఈ క్రమంలోని టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 లో పాల్గొనాల్సిందిగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కు ఆహ్వానం అందింది.
అసలు విషయంలోకి వెళితే.. తన సినీ కెరియర్ లో దర్శకుడిగా స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి నేటి ఆర్ఆర్ఆర్ దాకా దర్శక ధీరుడు విజయప్రస్థానం అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఏ సినిమా కూడా డిజాస్టర్ ను చవి చూడలేదు. ఇక ఈ నేపథ్యంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టొరెంటో ఫిలిం ఫెస్టివల్ -2022 కి హాజరు కావాల్సిందిగా రాజమౌళికి ఆహ్వానం అందింది. ఇక ఈ విషయాన్ని ఆ సంస్థ స్వయంగా ప్రకటించడం జరిగింది. ఇక ఈ క్రమంలోని సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కెనడాలోని టొరెంటో పట్టణంలో ఈ ఫెస్టివల్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు. ఇకపోతే ప్రతి ఏడాది కూడా ఈ వేడుకను నిర్వహిస్తారు.
ఇక ఇప్పటికే పలువురు హాలీవుడ్ నటులకు, రచయితలకు కూడా ఆహ్వానం లభించింది . ఇక అందులో భాగంగానే పలువురు హాలీవుడ్ దర్శకులతో పాటు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్ కి కూడా ఆహ్వానం అందినట్లు సమాచారం. ఇక ఈ సంస్థ ప్రపంచం గర్వించదగ్గ వారిని పిలిచి వారి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఇక అందులో భాగంగానే ఇండియా నుంచి రాజమౌళిని, హాలీవుడ్ నటుడు టైలర్ పెర్రిని, హిల్లరీ క్లింటన్ ఆహ్వానించింది. ఇక వారి నుంచి భవిష్యత్తు తరాల వారికి విలువైన సూచనలు అందజేయనున్నారు.