బంగారానికి అక్షయ తృతీయకు అసలు సంబంధం ఏమిటో తెలుసా..?

-

అక్షయ తృతీయ అంటే మనకు మొదట గుర్తొచ్చేది బంగారం. అసలు నిజంగా అక్షయ తృతీయ నాడు బంగారం ఎందుకు పెట్టాలి..? అక్షయ తృతీయ కి బంగారానికి ఉన్న సంబంధం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం…! చాలామంది ఇళ్లల్లో బంగారం కొని అక్షయ తృతీయ నాడు పూజ చేస్తూ ఉంటారు.

 

అయితే నిజంగా అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరు బంగారం కొనాలా..? ఇలా చాలా మందిలో సందేహాలు ఉంటాయి. మరి వాటి కోసం ఈరోజు చూద్దాం. అక్షయ తృతీయ నాడు ఏ పని మొదలు పెట్టినా విజయం తప్పక ఉంటుందని పండితులు చెబుతున్నారు. అదే విధంగా ఏ పుణ్య కర్మ ని ఆచరించినా కూడా మంచి ఫలితాలు కనబడతాయని.

ఏం చేసినా అక్షయంగా లభిస్తాయని పండితులు అంటున్నారు. ఆ రోజు నాడు దానధర్మాలు చేయడం అన్నిటి కంటే ముఖ్యమని దీని వల్ల మంచి లాభం పొందవచ్చని అంటున్నారు. అయితే ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే మన సంపదను కూడా అక్షయం అవుతాయని నమ్మకం.

అక్షయ తృతీయ నాడు ఎవరైనా వివాహం చేసుకుంటే బంధం చిరకాల నిలుస్తుందని అంటారు అక్షయ తృతీయ నాడు ఉన్న దాంట్లో దానం చేయడం లేదా పూజ చేయడం మంచిది. అంతే కానీ బంగారం కొనాలని అప్పు చేసి తప్పు చేసి కొనడం మంచిది కాదు. దాని వల్ల పాపాలు, కష్టాలు మాత్రమే ఉంటాయి.

కాబట్టి ఉన్న దాంట్లోనే పూజలు చేయడం యాగాలు, యజ్ఞాలు చేయడం లేదా పుణ్య కార్యాలు చేయడం మంచిది. ఈ కాలంలో ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి ఉద కుంభ దానం పేరు తో నీటి తో నింపిన కుండని దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news