జామకాయ ఆరోగ్యానికి ఎంత మేలో..యాపిల్ కంటే ఎక్కువ పోషకాలు..నారింజ కంటే ఎక్కువ విటమిన్ సీ

-

జామ కాయలంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరూ..టైం పాస్ కి కూడా తినేయొచ్చు. భోజనం చేసిన తర్వతా జామకాయ తింటే..జీర్ణంక్రీయ బాగా జరుగుతుందంటారు..ఇంకా ఇది మిగతా పండ్లతో పోల్చితే..చవకలో వచ్చేస్తుంది. సాధారణంగా డైలీ ఒక యాపిల్ తింటే..డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు అంటారు..అలాంటి యాపిల్ కంటే చాలా రెట్లు ఎక్కువ పోషకాలు జామకాయలో ఉన్నాయని మీకు తెలుసా..అసలు యాపిల్ తో జామకాయను కంపార్ కూడా చేయలేం అంత ఎక్కువ ఔషధగుణాలు జామకాయలో ఉన్నాయట.

50 ఏళ్ల క్రితమే నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ వారు జామకాయలను ఇంకా కొన్ని ఆహార పదార్థాలను సర్వే చేసి దేంటో ఎంతెంత పోషకాలు ఉన్నాయో చెప్పారు. జామకాయలో 40- 50 క్యాలరీల శక్తి ఉంటుందని ఆ పరిశోధనలో కనుగొన్నారు. రెండేళ్లక్రితం వీళ్లు మళ్లీ పరిశోధన చేసి జమాకాయలో 33 కాలరీలు ఉన్నట్లు తెలిపారు.

జామకాయలో ఉండే పోషకాలు

కార్పోహైడ్రేట్స్ 5.5 గ్రాములు
ఫ్యాట్ 0.3 గ్రాములు
ప్రొటీన్ 1.5 గ్రాములు
ఫైబర్ 8.5 గ్రాములు
విటమిన్ C 213 మిల్లీగ్రాములు. కమలాలు, బత్తాయిలు, నారింజకాయలు, నిమ్మకాయల్లో విటమిన్ C ఎక్కువ అనుకుంటారు. కానీ వాటన్నింటి కంటే నాలుగురెట్లు ఎక్కువ జామకాయలో ఉంది. రక్షణ వ్యవస్థకు తిరుగులేని ఆహారం జామకాయ.

జామకాయ వల్ల లాభాలు:

జామకాయలో ఉన్న అందరికి కలిగే మేలు ఏంటంటే..మిగతాపళ్లలా దీన్ని కార్భేడ్ వేసి పండించరు. పెస్టిసైడ్స్ వాడరు. కాబట్టి రసాయనాలు లేని మంచి పండుగా జామకాయను చెప్పుకోవచ్చు.
లో గ్రైసిమిక్ ఇండెక్స్ అని జామకాయను అంటారు. ఇది రక్తంలోకి త్వరగా చెక్కరను ఇవ్వదు. స్లోగా అరుగుతుంది. దీని ద్వారా వచ్చిన గ్లూకోస్ కొవ్వుగా మారే ఛాన్స్ ఉండదు. ఘగర్ పెంచే ఛాన్స్ ఉండదు. ఘగర్ పేషెంట్ పాలిట నం.వన్ ఫ్రూట్ జామకాయే.
దీన్ని తినటం వల్ల స్ట్రెచ్ మార్క్స్ రావు. ఎందుకంటే..ఇందులో ఉన్న హై డోసెస్ విటమిన్ C, మరికొన్ని యూటిన్స్ ఇవి స్కిన్ ఎలాసిటీని పెంచుతుంది. బరువు పెరగని సాగే గుణం కలిగి ఉంటుంది. కింద ఉండే కొలాజెన్ మెష్ ను చాలా హెల్తీగా తయారు చేస్తుంది.

విటమిన్ సీ డెఫీషియన్సీ ఉన్నప్పుడు ఈ స్ట్రెచ్ మార్క్ ఎక్కువగా వస్తాయని సైంటిఫిక్ గా నిరూపించారు. ముడతలు పడి వయసురాకుండానే పెద్దవయసువారిలా కనిపిస్తారు. దాన్ని నిరోధించడానికి జామకాయ బాగా పనికొస్తుంది.

స్కిన్ గ్లోకు, స్కిన్ హెల్తీగా ఉండాటానికి జామకాయ బాగా పనికొస్తుంది. రోజుకు ఒక జామకాయా తించే చర్మం అందంగా ఆరోగ్యంగా ఉంటుంది.

అలాగే జామకాయను తింటం వల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. బాడీకీ ఎక్కువ మోతాదులో అతి ముఖ్యంగా కావాల్సింది విటమిన్ సీ. ఇదే నంబర్ వన్ విటమిన్. ఇది తక్కువ రేటులో లభించే జామకాయలో ఉంది కాబట్టి..రెగ్యులర్ గా జామకాయను తింటే రక్షణ వ్యవస్థ మంచి స్ట్రాంగ్ పనిచేస్తుంది. రిపేర్,క్లీనింగ్, డీటాక్సిఫికేషన్ కు జామకాయ పెట్టింది పేరు.

జామకాయను తింటే ఇన్ని రకాల ప్రయోజనాలను మనం పొందవచ్చు. కాబట్టి చవకగా వచ్చే జామపళ్లను మార్కెట్ లో దొరినప్పుడు కొనటం మర్చిపోవద్దే..!

Read more RELATED
Recommended to you

Latest news