కాబూల్‌లో మరోసారి బాంబు దాడి.. 50 మంది మృతి

-

ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో మరోసారి బాంబు దాడి జరిగింది. కాబూల్‌లోని ఖలీఫా సాహిబ్‌ మసీదులో మానవ బాంబు తనను తాను పేల్చుకోవడంతో 50 మందికి పైగా మృతించెందగా.. మరో 100మంది గాయపడ్డారు. చివరి శుక్రవారం కావడంతో ఖలీపా సాహిబ్‌ మసీదు జనాలతో నిండిపోయింది. అంతా ప్రార్ధనలు ముగించుకున్న తర్వాత.. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు జరిగింది. దీంతో మసీదులో ఎక్కడ చూసినా శవాలు, క్షతగాత్రులే కనిపించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటికే ప్రార్ధన చేస్తున్నవారిలో కలిసిపోయిన మానవబాంబు తనను తాను పేల్చుకోవడంతో ఈ ఘోరం జరిగిందని స్థానికులు తెలిపారు.

Kabul blast Afghanistan explosion first vice president convoy attack death toll | World News – India TV

ఈ పేలుడులో 10 మంది చనిపోయారని, మరో 20 మంది గాయపడ్డారని ఆఫ్ఘనిస్థాన్‌ ఇంటీరియర్‌ మినిస్టర్‌ బిస్ముల్లా హబీబ్‌ చెప్పారు. అయితే ఇప్పటివరకు 66 మంది మరణించారని, 78 మంది గాయపడ్డారని వైద్య వర్గాల సమాచారం. కాగా, ఈ మారణహోమానికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ సంస్థా ప్రకటించలేదు. పవిత్ర రంజాన్‌ మాసంలో ప్రజలనే లక్ష్యంగా చేసుకుని దేశంలో వరుస దాడులు జరుగుతున్నాయి. గతవారం మజర్‌ ఈ షెరీఫ్‌ పట్టణంలోని ఓ మసీదుపై జరిగిన బాంబు దాడిలో 33 మంది మరణించిన విషయం తెలిసింది. ఈ పేలుడుకు తామే కారణమని ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రసంస్థ ప్రకటించుకుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news