రజినీకాంత్ జీవితాన్ని మార్చిన సీక్రెట్ ఏంటో తెలుసా?

-

తమిళ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు..ఇండస్ట్రీలో భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నా, కోట్లాది మంది అభిమానించినా చాలా సింపుల్గా ఉండడం రజినీకాంత్ స్పెషాలిటీ..నటనలో ఆయనదో స్టైల్.. క్రేజ్లో ఆయనకు తిరుగేలేదు. స్టైల్కు ఆయనొక ఐకాన్. కానీ బయట మాత్రం చాలా హుందాగా, తానొక సామాన్యుడు మాదిరిగానే ఉంటాడు. అందరు ఆయనను ముద్దుగా తలైవా అని, సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు. కండెక్టర్గా జీవితాన్ని ప్రారంభించిన రజనీకాంత్ నటుడిగా, మంచి మనిషిగాను ఇప్పుడు కోట్లాది మంది హృదయాల్ని గెలుచుకున్నారు. రజనీకాంత్ ఈ స్థాయికి చేరుకోవడం వెనక ఎంతో కష్టం ఉంది.

చెన్నై సెంట్రల్లోని రైల్వే స్టేషన్ టిక్కెట్ కలెక్టర్ని, సాయంగా నిలబడ్డ రైల్వే కూలీల గురించి చాలా ఉద్వేగంగా మాట్లాడారు.నేను నటుడిని కావాలనుకున్నప్పుడు నా స్నేహితుడు నన్ను మద్రాసు వెళ్లడానికి టిక్కెట్ కొని రైలు ఎక్కించాడు. కొంత డబ్బు కూడా ఇచ్చాడు. టిక్కెట్ కలెక్టర్ అందరి దగ్గర టిక్కెట్స్ చెక్ చేస్తున్నాడు. అందరి మాదిరిగా నన్ను కూడా అడిగాడు. అప్పుడు నా టిక్కెట్ చూసుకున్నాను. ఎవడో నా పర్సు కొట్టేశాడని, అందులో రైలు టిక్కెట్ కూడా ఉంది.

టిక్కెట్ కలెక్టర్కు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఆయన పక్కనే సైలెంట్గా నిలుచున్నాను. ప్రయాణీలకుందరి టిక్కెట్స్ చెక్ చేసిన తర్వాత.. అందరూ వెళ్లిపోయాక ఆయన నా వైపు చూశారు. అప్పుడు నేను మాట్లాడుతూ.. ‘సార్..నేను నిజంగానే టిక్కెట్ కొన్నాను. కానీ ఎవరో నా పర్సు కొట్టేశారు.. నన్నను నమ్మండి సార్’ అని టిక్కెట్ కలెక్టర్తో చెప్పారు. ముందు ఆయన నా మాట వినకుండా జరిమానా కట్టాలి అన్నాడు, లేదంటే జైలుకెళ్లాల్సిందేనని అని హెచ్చరించారు.

దాంతో ఒక్కసారిగా నేను బాగా కంగారు పడిపోయాను.. అప్పుడు అక్కడే ఉన్న కొందరు కూలీలు నన్ను నమ్మారు.సార్.. ఆ పిల్లాడు చెప్పేది వింటుంటే అబద్దం చెప్పలేదనిపిస్తుందండి’ అని కూలీలు అన్నారు. కానీ టిక్కెట్ కలెక్టర్ వినలేదు. చివరకు ఏమనుకున్నారో ఏమో కానీ ‘సరే.. నేను నిన్ను నమ్ముతున్నాను.. వెళ్లు అని అన్నారు. అప్పుడు ఆయనకు, రైల్వే కూలీలకు దణ్ణం పెట్టి ముందుకు కదిలాను. వాళ్లు నన్ను చూస్తున్నారు.అప్పుడే నన్ను జనం నమ్మారు..అది నాకు ఎదో తెలియని బలాన్ని ఇచ్చింది..అదే నన్ను ఇప్పుడు సూపర్ స్టార్ ను చేసింది అంటూ చెప్పుకొచ్చారు..

Read more RELATED
Recommended to you

Latest news