అదిరిపోయే లాభాలను ఇచ్చే మూడు పొదుపు పథకాలు ఏంటో తెలుసా?

-

డబ్బులను పెట్టుబడి పెట్టాలని అనుకొనేవారికి ఎన్నో మార్గాలు ఉన్నాయి అందులో కొన్ని మాత్రమే మంచి లాభాలను ఇస్తున్నాయి.. ఆ పొదుపు పథకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..పోస్టాఫీసు లో ఎన్నో పొదుపు పథకాలు ఉన్నాయి.. మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి..పోస్ట్ ఆఫీస్ చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, దీర్ఘకాలంలో హామీతో కూడిన మంచి రాబడిని సులభంగా పొందవచ్చు..

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతా, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతా, పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. టైమ్ డిపాజిడ్‌ మినహా మిగిలిన 2 పథకాలు 5 సంవత్సరాల లాక్-ఇన్‌తో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తాయి కాబ్టటి, ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితం. అలాగే పన్ను మినహాయింపు కూడా ఉంటుంది..

5 ఏళ్ల గడువుతో పోస్టాఫీస్‌ రికరింగ్‌ డిపాజిట్‌ ఖాతా . ఈ పథకంలో, RD మీద 5.8 శాతం వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ రేటు త్రైమాసికానికి అందుబాటులో ఉంటుంది. మీరు ఈ పథకంలో ప్రతి నెలా కనీసం రూ. 100 లేదా రూ. 10 గుణిజాల్లో ఉండే (110, 120..) మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు… మంచి లాభాలను సులువుగా పొందవచ్చు..

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్..ఇది 5 సంవత్సరాల కాలానికి 7% వరకు ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందించే పథకం. ఈ పథకం కింద, మీరు కనీసం రూ. 1000 లేదా రూ. 100 గుణిజాల్లో ఉండే (200, 300..) మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో గరిష్ట డిపాజిట్ పరిమితి లేదు. ఈ పథకంలో, 5 సంవత్సరాల కాల గడువు పూర్తయిన తర్వాత మాత్రమే మీ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు..కొన్ని షరతులు కూడా ఉన్నాయి.. అలాగే ఈ పథకం కింద డిపాజిట్ చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపు తీసుకోవచ్చు..

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతా.. ఒక రకమైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్ అని చెప్పవచ్చు. ఈ పథకం కింద, మీ డబ్బును 1, 2, 3 లేదా 5 సంవత్సరాల పాటు పోస్టాఫీసులో డిపాజిట్ చేయవచ్చు. ఒకటి, రెండు, మూడు సంవత్సరాల FDలపై 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు ఇంకా మంచి రాబడి కోసం చూస్తున్నట్లయితే, 5 సంవత్సరాల వరకు టైమ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టాలి. 5 సంవత్సరాల్లో 7% అత్యధిక వడ్డీ రేటు పొందుతారు.. ఇందులో కూడా పన్ను మినహాయింపు కూడా ఉంది.. ఈ స్కీమ్ లలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news