మెదడు ఆరోగ్యానికి అద్భుతమైన ఆహారం ఏమిటో తెలుసా..?

-

ఏ వ్యక్తి అయినా ముందుకు దూసుకుపోవాలంటే ఆ వ్యక్తి శరీర ఆరోగ్యంతో పాటు మానసికంగా కూడా దృఢంగా ఉండాలి.. మెదడును చురుగ్గా ఉంచుకోవాలి. జీవితకాలం పెరుగుతున్న కొద్దీ మన మెదడుకు సంబంధించిన సమస్యల తాకిడి బాగా పెరుగుతోంది. మెదడు చురుకుదనం తగ్గిపోవడం, మతిమరుపు రావడం, ఏకాగ్రత లోపించడం ఎప్పుడూ మగతగా ఉండడం ఇలా ఎన్నో రకాల సమస్యలు వచ్చిపడుతున్నాయి. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు మెదడును ఎప్పుడూ చురుకుగా,ఉత్సాహంగా ఉంచుకునేందుకు ఏ ఏ ఆహారాలు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మెదడు మనిషి మనుగడకు, ఆలోచనలకు, ఆశయాలకు,బందాలకు , అనుబంధాలకు,మేధస్సుకు చివరికి అన్నిటికీ ఇదే భాండాగారం. శరీర బరువులో మెదడు బరువు కేవలం రెండు శాతమే కానీ గుండె నుంచి రక్తం సరఫరా అయ్యేది 15శాతం మెదడుకు వెళ్లాల్సిందే. మనం పీల్చే ప్రాణవాయువులో 20 శాతం మెదడు స్వీకరిస్తుంది. అంతే కాదు మన కోసం తయారయ్యే శక్తిలో 5 శాతం మన మెదడు వినియోగిస్తుంది. బరువు ప్రకారం మెదడు చిన్నదే కావచ్చు కానీ తాను నిర్వహించే విధులు ప్రకారం చూస్తే మాత్రం తన ప్రతి కదలిక ప్రతి ఆలోచన మన ప్రతి పని లెక్క ప్రకారం అన్నీ దానివే.

మెదడు చురుగ్గా ఉండాలంటే బాదాం, ప్రొద్దుతిరుగుడు విత్తనాలు,వాల్ నట్స్ లో ఉండే పాలీఫినాల్స్ మెదడులోని న్యూరాన్స్ ను,బ్రెయిన్ మధ్య కమ్యూనికేషన్ పెంచుతుంది. ఒక గుప్పెడు వాల్ నట్స్ తినడం వల్ల మెమరీ పవర్ ను మెరుగుపరుచుకునే శక్తి వస్తుంది. అవిసె గింజలను రోజూ తీసుకుంటే బ్రెయిన్ ఆలోచనాశక్తి ని పెంచడానికి చాలా ఉపయోగపడతాయి. వీటిని పెరుగుతో కాని, సలాడ్స్ తో గాని కలిపి తినవచ్చు. ఓట్స్ మరియు చిరు ధాన్యాల తో కలిపి తీసుకోవడంవల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మెదడుకణాలు శక్తిని గ్లూకోజ్ రూపంలో మాత్రమే తీసుకుంటాయి కాబట్టి ఎప్పుడైతే సమయానికి ఆహారం తీసుకుంటామో, అది గ్లూకోజ్ గా మారి మెదడుకు అందించడంవల్ల మెదడు చురుగ్గా పని చేసి ఏ నిర్ణయాలయినా తొందరగా తీసుకుంటాము.

Read more RELATED
Recommended to you

Latest news