ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌కు చెందిన 48,000 మంది పోస్ట్‌మెన్‌లకు ఇంటి వద్దే ఆధార్ కార్డ్ సేవలను అందించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) శిక్షణనిస్తోంది.ఆధార్ కార్డు ఉన్నవారికి ఇది చక్కటి శుభవార్త. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఇంటింటికీ ఆధార్ సేవను విస్తరించాలని యోచిస్తోంది. అంటే ఇక నుంచి మీరు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మీ ఇంటి వద్దకే ఆధార్ కార్డు సేవలను పొందగలుగుతారు.
ఇప్పుడు మీ పోస్ట్‌మాన్ మీ ఇంటికి ఉత్తరాలను అందజేయడంతో పాటు ఆధార్ సేవలను కూడా అందజేస్తాడు. దీని కోసం, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌కు చెందిన 48,000 మంది పోస్ట్‌మెన్‌లకు శిక్షణ ఇస్తోంది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి మొబైల్ నంబర్‌లతో ఆధార్ నంబర్‌ను లింక్ చేయడం, వివరాలను అప్‌డేట్ చేయడం మరియు ఇంటి వద్దే పిల్లల నమోదును నిర్వహించడం వంటి వాటికి శిక్షణ ఇవ్వబడుతుంది.
ఆధార్ కార్డ్ హోల్డర్ల యొక్క అవసరమైన వివరాలను అప్‌డేట్ చేయడానికి డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ ఆధారిత ఆధార్ కిట్ వంటి అవసరమైన డిజిటల్ పరికరాలను పోస్ట్‌మెన్‌లకు UIDAI అందిస్తుంది. UIDAI ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క కామన్ సర్వీస్ సెంటర్‌తో పనిచేస్తున్న దాదాపు 13,000 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్‌లను ఆన్‌బోర్డ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. IPPB పోస్ట్‌మెన్ మరియు CSC బ్యాంకింగ్ కరస్పాండెంట్‌ల ద్వారా వీలైనంత త్వరగా ఆధార్ వివరాలను సేకరించి, అప్‌డేట్ చేస్తారని నిర్ధారించుకోవడానికి దేశంలోని 755 జిల్లాలలో ప్రతి ఒక్కటి ఆధార్ సేవా కేంద్రాన్ని తెరవాలని కూడా యోచిస్తోంది. ప్రస్తుతం, 72 నగరాల్లో 88 UIDAI సేవా కేంద్రాలు ఉన్నాయి. మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యం..