గతంలో సినిమా అంటే ఆరు పాటలు పది ఫైట్లు. ప్రతీ సినిమా దాదాపుగా ఇలాగే ఉండేది. హీరో వెళ్లి పది మందిని కొడితేనే హీరో అంటారు. విలన్ ఉండాలి ఆ విలన్ సైకో అయి ఉండాలి. పాటలు ఉండాలి, హీరో హీరోయిన్లు డాన్స్ లో దుమ్ము రేపాలి. అలా ఉంటేనే అది సినిమా అవుతుంది. అయితే ఇప్పుడు ట్రెండ్ మార్చేసారు ప్రేక్షకులు. సినిమాలో కొత్తదనం కోరుకుంటున్నారు. ఆ కొత్తదనం ఎలానో ఒకసారి చూద్దాం.
ఈ రోజుల్లో సినిమా అంటే అందులో పాటలు లేకపోయినా ఫైట్లు లేకపోయినా సరే కథ బాగుంటే చాలు. అంటే కథలో ఆసక్తి ఉండాలి, కథ భిన్నంగా ఉండాలి. రెగ్యులర్ ఫైట్లు, డైలాగులు కోరుకోవడం లేదు. పంచ్ డైలాగులకు కాలం చెల్లింది. వాటి స్థానంలో సెటైర్లు, ఆలోచించే మాటలు ఉండాలని కోరుకుంటున్నారు ప్రేక్షకులు. పాటలు లేకపోయినా పర్వాలేదు గాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్కువగా ఉండాలి.
యాక్షన్ సీన్లు లేకపోయినా పర్వాలేదు గాని సీన్ లో ఆసక్తి ఉండాలి. అలా ఉంటేనే సినిమా కోరుకుంటున్నారు. గ్రాఫిక్స్ సినిమాలు కూడా పెద్దగా ఇష్టపడటం లేదు. సినిమా సింపుల్ గా ఉండాలి. హీరోయిన్ గ్లామర్ గా లేకపోయినా పర్వాలేదు గాని నటన బాగుండాలి. హీరో ఆరు అడుగులు లేకపోయినా సరే అతని నటన బాగుంటే చాలు. చాలా సినిమాలు ఇలా వచ్చే సైలెంట్ గా హిట్ కొడుతున్నాయి. అడవి శేష్ హీరో గా వచ్చిన ఎవరు సినిమా అందుకే ఆ స్థాయిలో హిట్ అయింది.