పిల్లలకు పెయిన్ కిల్లర్ ఇస్తే వాళ్ళ ప్రాణం తీసినట్టేనా…?

-

పెయిన్ కిల్లర్లు… చిన్న దెబ్బ తగిలినా సరే మేము చాలా సున్నితం అయ్యబాబోయ్ అంటూ భరించలేకపోతున్నారు. నొప్పి కొంచెం కూడా తట్టుకోలేక పెయిన్ కిల్లర్ వేసుకుని ఉపశమనం పొందాలని చూస్తున్నారు. పెద్దలు, పిల్లలు, వృద్దులు అందరూ కూడా ఇదే పని చేస్తున్నారు. ఆ కాసేపు నొప్పి భరించలేక ప్రాణం పోతుంది అది పోతుంది, ఇది పోతుంది అంటూ టాబ్లెట్ వేసుకుని పడుకుంటారు.

కాని అసలు అది ఎంత మాత్రం మంచిది కాదని న్యూయార్క్ శాస్త్రవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా పిల్లలకు అసలు అది ఎంత మాత్రం మంచిది కాదని, ప్రాణాల మీదకు తెస్తుందని హెచ్చరిస్తున్నారు. అధిక మోతాదులో, శక్తిమంతమైన పెయిన్‌కిల్లర్లు తీసుకున్న పిల్లల్లో అవి విషపూరితంగా మారిపోయి వాళ్ళ ప్రాణం మీదకు తెస్తున్నాయని, కొంత మంది అనారోగ్యం బారిన కూడా పడుతున్నారని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా అమెరికాలో పెయిన్ కిల్లర్లు తీసుకున్న చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అమెరికాలోని ఎమోరీ యూనివర్సిటీ పరిశోధకులు దీనిపై ఒక సర్వే కూడా చేసారు. ఈ సర్వేలో వారు ఆసక్తికర విషయాలు గుర్తించారు. పెయిన్‌కిల్లర్లను అధిక మోతాదులో తీసుకోవడమే కాకుండా వాటిని అదే పనిగా వాడితే, అవి విషపూరితంగా మారుతాయని, పిల్లల మీద ఓపియాడ్‌ మహమ్మారి తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉందని గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news