హోటల్స్‌లో వాడేసిన సోప్స్‌ ఏం చేస్తారో తెలుసా..? మళ్లీ వాడుకలోకి..!!

-

మీరంతా చూసే ఉంటారు..హోటల్స్‌కు వెళ్లినప్పుడు రూమ్‌లో సోప్స్‌, షాంపూలు ఉంటాయి.. ఇష్టం ఉన్నవాళ్లు వాటిని వాడతారు..లేదంటే వదిలేస్తారు. అయితే మనం ఉండే రెండు మూడు రోజులు ఆ సోప్‌ వాడినా అది అయిపోదు.. వాటిని అక్కడే పడేసి వచ్చేస్తాం.. మరీ ఆ హోటల్‌ వాళ్లు ఆ సోప్‌ను డస్ట్‌బిన్‌లో వేసి మళ్లీ కొత్తవి పెడతారునుకుంటున్నారా.? పాతవి అయితే ఎలాగూ ఉంచలేరు.. మరీ ఆ మిగిలిపోయిన సోప్స్‌ ఏం చేస్తారో తెలుసా..?

కొన్ని హోటల్స్‌లో అయితే వాటిని పడేస్తారు కానీ కొన్ని హోటల్స్‌లో మాత్రం సగం ఉపయోగించిన సబ్బులను కంపెనీలకు పంపిస్తారట. ఉదాహరణకు ”క్లీన్ ద వరల్డ్” అని ఒక కంపెనీ ఉంది. హోటల్ వాళ్ళు వాడి పడేసిన సోప్స్‌ను అక్కడికి పంపిస్తాయి. అయితే ఆ కంపెనీలు హోటల్స్‌లో వాడేసిన సబ్బులను తీసుకుని కరిగించి కొత్త సబ్బులను తయారు చేస్తాయి. క్లీన్ ద వరల్డ్ చాలా మంచిగా పని చేస్తుంది. 2016లో ఏడు మిలియన్ల సబ్బులను తయారుచేసింది. అలానే నాలుగు లక్షల హైజీన్ కిట్స్‌ని కూడా తయారు చేసింది. వీటిలో ఐదు లక్షల సోప్స్‌ని హరికెన్‌లో ఎఫెక్ట్ అయిన వారికి పంపించారట..

ఈ కంపెనీ సగం ఉపయోగించిన షాంపూల మీద కూడా పనిచేస్తుంది. అలానే బాడీ వాష్, కండిషనర్లు మీద కూడా ఈ కంపెనీ వర్క్‌చేస్తుందట… ఇలా పని చేసే కంపెనీలు ఈ బాటిల్స్‌ని సేకరించి.. రీసైక్లింగ్ చేస్తాయి.. పైగా కొన్ని కంపెనీలు టూత్ పేస్ట్. టూత్ బ్రష్‌లని కలెక్ట్ చేసి రీసైక్లింగ్ చేస్తాయట… ఇల్లు లేని వాళ్ళకి, నిరుపేదలకు ఇటువంటి వాటిని ”క్లీన్ ద వరల్డ్” పంపిణీ చేస్తోంది.

కొన్ని హోటల్స్‌లో అయితే సబ్బులన్నిటినీ తీసుకుని టాయిలెట్స్‌ని క్లీన్ చేయడానికి ఉపయోగిస్తారట. కొన్ని హోటల్ వాళ్ళు కిచెన్లో ఉపయోగించే నూనెని కూడా మళ్ళీ రీసైక్లింగ్ కంపెనీలకి పంపిస్తారు. మరి కొన్ని హోటల్స్ అయితే ఉపయోగించిన బల్బులుని కూడా రీసైక్లింగ్‌కి పంపిస్తారట. హోటల్ వాళ్ళు ఇలా కంపెనీలకు ఇస్తే తిరిగి కంపెనీలు వీరికి డబ్బులు చెల్లిస్తారట. పైగా రీసైక్లింగ్ చేయడం నిజంగా పర్యావరణానికి ఎంతో మేలు చేసే విషయం. సో అలా చేస్తాయనమాట హోటల్స్..

Read more RELATED
Recommended to you

Latest news