సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతవరకు హీరోయిన్లు తమ ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అవకాశాలు తగ్గడం లేదా వివాహం చేసుకోవడం వల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉంటారు. అలా సినీ ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లలో బన్నీతో కలిసి పరుగు సినిమాలో నటించిన షీలా కూడా ఒకరు. సీతాకోకచిలుక సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ తర్వాత మంచు మనోజ్ హీరోగా వచ్చిన రాజు భాయ్ చిత్రంలో నటించారు. ఈమెకు గుర్తింపు లభించింది మాత్రం పరుగు చిత్రంతోనే.. పరుగు సినిమా తర్వాత మస్కా, అదుర్స్ వంటి పలు చిత్రాలలో కూడా నటించి మెప్పించింది..
తెలుగు తోపాటు తమిళంలో కూడా పలు చిత్రాలలో నటించిన షీలా సినిమా అవకాశాలు తగ్గడంతో ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఆమెకు క్యాన్సర్ వ్యాధి సోకిందని సమాచారం కూడా అందింది. అయితే క్యాన్సర్ ఉన్నా కూడా ఈమె మరికొన్ని సినిమాలలో నటించిందట . తనకు క్యాన్సర్ ఉన్నట్టు ఎప్పుడు బయట పెట్టలేదు. రహస్యంగానే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంది షీలా. ఇప్పటికీ ఆమె క్యాన్సర్ తో పోరాడుతోందని ఆమె సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ విషయం ఇప్పుడు ఎవరికీ చెప్పకుండా ఎవరి సహాయం తీసుకోకుండా ఆమె మేనేజ్ చేసుకుంటుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం సూపర్ మార్కెట్ స్టోర్ నడుపుతోందని, ఎవరి సహాయం తీసుకోవడం ఇష్టం లేకనే ఒకప్పుడు హీరోయిన్ గా ఉన్న ఈమె ఇప్పుడు ఇలా సూపర్ మార్కెట్ తో జీవితం గడుపుతోందని సమాచారం. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫోటోలు ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా జాగ్రత్త పడడమే విశేషం. ఆమె క్యాన్సర్ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.