రక్తం ఏరు ఎక్కడ ప్రవహిస్తుందో తెలుసా?

-

మాములుగా నదులలో నీళ్లు నీలం రంగులో లేదా మట్టి కలర్ లో ఉంటాయి.. అయితే కొన్ని నదులలో నీళ్లు వివిధ రంగులలో దర్శనమిస్తు సైన్స్ కు సవాల్ విసురుతున్నాయి.. ఇప్పుడు ఓ నది ఎరుపు రంగులో ప్రవహిస్తుంది.. దాని పుట్టు పూర్వాలను కనుక్కోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.. ఆ నది పై వారి పరిశోధనలు మొదలయ్యాయి. తెల్లటి మంచుతో కప్పబడిన ఖండం అంటార్కిటికా. నెలల తరబడి ఆ ఖండంపై సూర్యకాంతి పడదు. అయితే ఇక్కడ రక్త నది ప్రవహిస్తోంది. దీనికి బ్లడ్ ఫాల్స్ రివర్ అంటారు. భూమి దక్షిణ భాగంలో ఉన్న ఈ ఖండంలో ఎక్కువ భాగం మంచే ఉంటుంది.

 

తెల్లటి దుప్పటి కప్పుకున్న ఈ జలపాతంలో రక్తపు నీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నెత్తుటి జలపాతంపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు బ్లడ్ ఫాల్స్ రివర్ మిస్టరీ వెలుగులోకి వచ్చింది…ఓ వెబ్ సైట్ అందించిన సమాచారం ప్రకారం..ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ అలస్కా ఫెయిర్‌బ్యాంక్స్ పరిశోధకులు ఈ నది మిస్టరీని ఛేదించడంలో విజయం సాధించారు. ఈ జలపాతాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రేలియా శాస్త్రవేత్త థామస్ గ్రిఫిత్ టేలర్ కనుగొన్నారు. ఈ సరస్సు వయస్సు సుమారు 1.5 మిలియన్ సంవత్సరాలు. ఈ లోయలో ఐరన్‌ కంటెంట్‌తో కూడిన ఉప్పునీరు ఉండటమే ఇందుకు కారణమని పరిశోధకులు చెబుతున్నారు..

అక్కడ ఆక్సీకరణ కారణంగా ఐరన్ ద్రవం గాలిలోని ఆక్సిజన్‌తో తాకినప్పుడు నీరు రక్తం ఎరుపు రంగులోకి మారుతుంది. ఏళ్ల తరబడి ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. ఈ బ్లడ్ ఫాల్స్ ఎత్తు ఐదు అంతస్తుల భవనంతో సమానం. ఎర్త్ స్కై నివేదిక ప్రకారం, బ్లడ్ ఫాల్స్ నీటిలో ఆక్సిజన్ లేదని పరిశోధన తర్వాత పరిశోధకుల బృందం కనుగొంది. కానీ 17 రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి. సల్ఫేట్ తగ్గింపు ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తుంది..ఇక్కడ ఇతర జీవులు అత్యంత క్లిష్ట పరిస్థితులలో మాత్రమే పెరుగుతాయని చెబుతున్నారు.. ఏది ఏమైనా ఈ నది భయంకరమైన రూపంతో అందరిని భయపెడుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news