సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టు, కమెడియన్ లాంటి పాత్రలకు మాత్రమే పరిమితం అవ్వకుండా విలన్ పాత్రలో కూడా ప్రేక్షకులను మెప్పించారు. అంతేకాదు చాలామంది గాయకులుగా, రచయితలుగా , దర్శకులుగా, నిర్మాతలుగా ఇలా ఎన్నో రంగాలలో తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేసిన వారు రాజకీయాలలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక అలాంటి వారిలో కొంగర జగ్గయ్య కూడా ఒకరు. ఈయన మొట్టమొదటిసారి సినీ ఇండస్ట్రీ నుంచి లోక్సభకు ఎంపీ అయ్యారని బహుశా చాలామందికి తెలియదని చెప్పాలి. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన మొదటి నటుడు ఎవరు అంటే టక్కున స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు చెబుతారు. కానీ ఈయన కంటే ముందు లోక్ సభకు ఎంపీగా ఎన్నికయి రాజకీయాలను ఏలారు జగ్గయ్య.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. జగ్గయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా ఒకే కాలేజీలో చదవడం. ఇక జగ్గయ్య ఎన్టీఆర్ కి సీనియర్.. ఆయనతో కాలేజీ అప్పుడే పరిచయం ఏర్పడింది. ఇక అందుకే సీనియర్ గా ఉన్న జగ్గయ్య 1967లో ఒంగోలు పార్లమెంటు సీటు కోసం పోటీ చేసి ఏకంగా 80 వేలకు పైగా మెజారిటీ ఓట్లతో గెలుపొందారు. ఇకపోతే జగ్గయ్య మొదట జయప్రకాష్ గారి ప్రజా సోషలిస్టు పార్టీలో కాలేజీ రోజుల్లోనే చేరినా..ఆ తర్వాత 1956లో కాంగ్రెస్ పార్టీలో చేరి 1967లో లోక్సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక అలా మొట్టమొదటిసారి ఒక సినిమా వ్యక్తి ఇండియన్ పొలిటికల్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ విషయం బహుశా చాలామందికి తెలియదని చెప్పవచ్చు.
ఇకపోతే జగ్గయ్య రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలను రవీంద్ర గీత పేరుతో తెలుగులోకి అనువదించారు. తెలుగులో కూడా ఎన్నో చిత్రాలలో నటించి మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు జగ్గయ్య.