‘‘బిగ్ బాస్’’ వాయిస్ ఎవరిదో తెలుసా..?

-

బిగ్ బాస్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు.. ఇంటి నిమయాలను మీరు పాటించని కారణంగా బిగ్ బాస్ మిమ్మల్ని శిక్షిస్తున్నారు.. బిగ్ బాస్ మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు.. అంటూ హౌజ్‌లో ఓ వాయిస్ వినిపిస్తుంటుంది. బిగ్ బాస్ రియాలిటీ షో ఇంత సక్సెస్ కావడానికి కారణం ఆ వాయిస్ కూడా. మనం రోజూ టీవీలో వినే బిగ్ బాస్ వాయిస్ ఓవర్ రాధాకృష్ణ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్‌ది. నిజానికి స్టార్ మాలో తెలుగులో బిగ్ బాస్ షో మొదలు పెట్టాలనుకున్నపుడు చాలా మంది వాయిస్ టెస్ట్ చేసారు. ఎంతోమందిని టెస్ట్ కట్ కూడా చేసారు. అయితే వాళ్లు అనుకున్నట్లుగా ఎవరి వాయిస్ కూడా దగ్గర్లో రాలేదు. అలాంటప్పుడు రాధాకృష్ణ వాయిస్ కూడా టెస్ట్ చేసారు.

 

అది పర్ఫెక్టుగా సరిపోయింది.. అలాగే నిర్వాహకులకు కూడా బాగా నచ్చింది. దాంతో వెంటనే షో నిర్వాహకులు కూడా ఓకే చెప్పారు. మొదటి సీజన్ నుంచి నాలుగో సీజన్ వరకు కూడా ఆయనే చెప్తూ వస్తున్నాడు. రెమ్యునరేషన్ గొడవలొచ్చి మధ్యలో ఈయన బిగ్ బాస్ కు వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదని వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ పుకార్లేనని తేలింది. కాగా రాధాకృష్ణ అంతకంటే ముందు హిందీ నుంచి తెలుగులోకి డబ్ అయిన సీఐడీ ప్రోగ్రామ్ కి కూడా డబ్బింగ్ చెప్పాడు. అన్నట్టు ఈ కార్యక్రమం కూడా స్టార్ మా లోనే ప్రసారం అయ్యేది.

Read more RELATED
Recommended to you

Latest news