‘మృగశిర కార్తె ‘కు చేపలను ఎందుకు తింటారో తెలుసా?

-

ఈరోజు నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. ఆశ్విని మొదలుకుని రేవతి వరకూ మనకున్న 27 నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది..హిందూ జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం..ఒక్కో కార్తెలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటినుంచి నైరుతి రుతుపనాలు వస్తాయి. వాతావరణం ఒక్కసారి చల్లబడటం, ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలతో సతమతమవుతుంటారు.మార్చి నుంచి మే వరకూ ఉంటుంది.

నైరుతి రుతుపవనాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉపశమనం కలుగుతుంది. ఈ మృగశిర కార్తెలో రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా ఉంటుంటారు. ఈ కాలంలో రుతుపవనాలు విస్తరించి తొలకరి వర్షాలు పడగనే రైతులు పొలాన్ని దున్ని కొత్త పంటలను వేస్తారు.

ఈ కార్తెకు ఆ పేరు ఎందుకు వచ్చింది..

సాదారణంగా చంద్రుడు ఒక్కో కార్తిలో 14 రోజులు ఉంటాడు.ప్రస్తుతం మృగశిర నక్షత్రానికి చేరువలో చంద్రుడు ఉండటం వల్ల దీనికి మృగశిర కార్తె అనే పేరు వచ్చింది.

ఈ రోజు చేపలకు అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది?

15 రోజుల పాటు ఈ కార్తె ఉంటుంది. మృగశిర కార్తె చేపలు తినడాన్ని మన పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తోంది. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఈ కార్తె రావడంతో వర్షాలు మొదలు కానున్న నేపథ్యంలో పలు వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి..వర్షాకాలంలో వచ్చే రోగాలకు తట్టుకునే శక్తిని చేపలు కలిస్తాయని పూర్వికులు అంటున్నారు.శాఖాపరమైన ఇంగువను బెల్లంలో కలుపుకొని ఉండలు చేసుకొని తినెవారు. మాంసాహారం తీసుకొనే వాళ్ళు చేపలను చింత చిగురు, ఇంగువ వేసుకొని కూర వండుకొని తింటారు. అది ఈ కార్తె కు గల ప్రాముఖ్యత..

Read more RELATED
Recommended to you

Latest news