Breaking : ఆర్టీసీకి రికార్డు స్థాయలో లాభాలు..

-

ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించిననాటి నుంచి ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో రాబడిలో తెలంగాణ ఆర్టీసీ నిన్న దుమ్ము రేపింది. ఏకంగా రూ. 15.59 కోట్లు ఆర్జించింది. అలాగే, ఆక్యుపెన్సీ కూడా 85.10 శాతం నమోదు కావడం గమనార్హం. ఈ స్థాయిలో ఆదాయం రావడం గత మూడు నెలల్లో ఇదే తొలిసారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

Night curfew: TSRTC to operate its last service in GHMC areas at 9 pm

నిన్న 34.69 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడవగా, మొత్తంగా 34.17 లక్షల మంది గమ్యస్థానాలకు చేరారు. నిజానికి నిన్న రూ.13.64 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, అదనంగా రూ.1.95 కోట్ల ఆదాయం రావడంతో అధికారులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కాగా, కరోనా తర్వాత ఇంత భారీ మొత్తంలో ఆదాయం రావడం ఇది రెండోసారని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news