కమల్ హాసన్ ట్రూ లెజెండ్..‘విక్రమ్’పై డైరెక్టర్ శంకర్ రివ్యూ

-

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘విక్రమ్’ ఫిల్మ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు చక్కటి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ చూశారు. మూవీ టీమ్ పైన ప్రశంసల వర్షం కురిపించారు.

కమల్ హాసన్ వెండితెరపైన 360 డిగ్రీల్లో నిజమైన లెజెండ్ గా కనిపించారని, డైరెక్టర్ లోకేశ్ చాలా కష్టపడి సినిమాను బాగా తీశారని ప్రశంసించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, యాక్షన్ మాస్టర్స్ అన్బరివ్ అందరికీ కుడోస్ చెప్పారు దర్శకుడు శంకర్. టీమ్ మొత్తానికి నమస్కారం పెట్టినట్లు సింబల్ పెట్టి ట్వి్ట్టర్ వేదికగా శంకర్ ట్వీట్ చేశాడు.

శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో RC15 ఫిల్మ్ చేస్తున్నారు. ఈ పిక్చర్ తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్ తో ‘ఇండియన్-2’ చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. కొవిడ్ నేపథ్యం, క్రేన్ ప్రమాదం, లైక్ ప్రొడక్షన్స్ , డైరెక్టర్ శంకర్ మధ్య వివాదం వలన సినిమా షూటింగ్ ఆగిపోయింది. త్వరలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news