వాలంటైన్స్ డేకు రెడ్ రోజ్ ఎందుకు ఇస్తారు..ఇచ్చే ప్రతి రోజాకు ఓ లెక్కుందని తెలుసా..!

-

ప్రేమికుల రోజు వచ్చేసింది..ఈరోజు ఎన్నో కొత్త ప్రేమకథలు మొదలవబోతున్నాయి..ఎంతో మంది తమ ప్రియమైన వారికి తన లవ్ ను ప్రపోజ్ చేయాడనికి ఎంతో ధైర్యాన్ని కూడపెట్టుకుని రెడీగా ఉన్నారు. అయితే ప్రేమకు గుర్తు రెడ్ రోజ్..రోజ్ ఇచ్చి లవ్ యూ చెప్పడం మనం ఎన్నో సినిమాల్లో చూశాం..అసలు ప్రేమకు గుర్తుగా రెడ్ రోజే ఎందుకు ఇవ్వాలి..ఏ బ్లాకో , వైటో, పర్పుల్ కలర్ కూడా రోజ్ ఉంటుంది. ఇవి ఇవ్వొచ్చుగా..రెడ్ కలర్ రోజ్ ఎందుకు ఇస్తున్నారు..తీసుకున్న మీకు, ఇచ్చిన తనకు కారణం తెలియాలి కదా..తెలియాలంటే..ఈ ఆర్టికల్ మొత్తం చదవాలి కదా..! ఇంకా అధ్యయనాల్లో ఈరోజు ఏం చేస్తారో కూడా తేలింది..అవి కూడా చదివేయండి..!
వాలంటైన్స్ డే రోజున మన మనసుకు నచ్చిన వారికి అందించడానికి రోజా పూలను కొనుగోలు చేయడం తెలిసిందే. అయితే వీరిలో 73 శాతం మంది పురుషులు కాగా, 23 శాతం మంది మాత్రమే అమ్మాయిలు తమకు నచ్చిన వారికి పూలను సింగిల్‌గా లేదంటే బొకేల రూపంలో అందిస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది.
వేలంటైన్స్ డే సందర్భంగా ఏటా దాదాపు 35 మిలియన్లకు పైగా హృదయాకారంలో ఉండే చాక్లెట్ బాక్సులు కొనుగోలవుతున్నాయట! అంతేకాదు.. ఈ రోజున కేవలం చాక్లెట్లకే సుమారు 7 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తేటతెల్లమైంది.
ఈ రోజున ఎక్కువమంది మగవారేమో తమకు నచ్చిన అమ్మాయిలకు కానుకివ్వడానికి పూలను కొనుగోలు చేస్తే.. దాదాపు 85 శాతం మంది అమ్మాయిలు విభిన్న రకాలైన బహుమతులతో తమ లవర్ ను సర్‌ప్రైజ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట.
ప్రేమికులంతా ఎంతో ప్రత్యేకంగా భావించే ఈ ప్రేమికుల దినోత్సవం రోజున లవర్స్ గ్రీటింగ్ కార్డుల్ని ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. అయితే విక్టోరియా కాలంలో మాత్రం ఈ కార్డుల్ని దురదృష్టానికి చిహ్నంగా భావించేవారట.
యూరప్‌లో 5-15వ శతాబ్దం మధ్య కాలంలో అమ్మాయిలు ఈ రోజున తమకు కాబోయే భర్తను మనసులో తలచుకుంటూ కొన్ని రకాల ఆహార పదార్థాల్ని తినేవారట.
ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తమ ప్రేమను ఎదుటి వ్యక్తికి తెలపడం కంటే తమని తామే ప్రేమించుకోవడానికి, కానుకలిచ్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారట కొందరు అమెరికన్ మహిళలు. ఇలా ఏటా వేలంటైన్స్ డే రోజున 15 శాతం మంది అమెరికన్ మహిళలు తమకు తామే పువ్వులు, ఇతర బహుమతుల్ని అందించుకుంటూ తమని తాము ప్రేమించుకోవడం అత్యంత అవసరమని ప్రపంచానికి చాటి చెప్పుతున్నారు. .
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తమ మనసుకు నచ్చిన వారికి ఎరుపు రంగు రోజాలను అందిస్తూ తమ ప్రేమను చాటుకుంటారు ప్రేమికులు. అయితే ఎరుపు రంగు రోజానే ఎందుకంటే.. ఎర్రగులాబీ అనేది రోమన్ల ప్రేమ దేవత అయిన ‘వీనస్’కి ఎంతో ఇష్టమైన పువ్వు.. అలాగే ఎరుపు రంగు రొమాన్స్‌కి చిహ్నం.. కాబట్టి ఈ రెండింటి కలయికగా ఈ రోజున ఎరుపు రంగు గులాబీలను అందించడం నాటి నుంచి కొనసాగుతోంది.
ఈ ప్రత్యేకమైన రోజున ప్రేమికుల మధ్య ప్రేమ ప్రతిపాదనలే కాదు.. పెళ్లి ప్రతిపాదనలు కూడా వస్తున్నాయట. అలా ఏటా సగటున 2 లక్షలకు పైగా పెళ్లి ప్రతిపాదనలు చేస్తున్నారట!
  • ఇచ్చే ప్రతి రోజా పువ్వుకు ఓ లెక్కుంది..తెలుసా
  • ఒక్క గులాబీ ఇస్తే ‘నిన్నే ప్రేమిస్తున్నాను’ అని అర్ధం.
  • తొమ్మిది ఇస్తే ‘ఎప్పటికీ నీతోనే ఉండాలనుకుంటున్నా’ అనీ,
  • 50 రోజాలు ఇస్తే నా ప్రేమ నా చేతుల్లో లేదు’ అని చెప్పడమట.
  •  99 గులాబీలు ఇచ్చారంటే- ‘చావు తప్ప మనల్ని మరేదీ విడదీయలేదు’ అని అర్థం..
  • 100 ఇస్తే ‘నిండు నూరేళ్లూ నీతోనే ఉండాలి’ అని తెలపడమన్నమాట.
  • ఈ జన్మలోనే కాదు, ఎప్పటికీ నువ్వే నా ప్రాణం’ అని చెప్పాలంటే, 101 ఎర్ర గులాబీలు ఇ‌వ్వాలి..
  • ఇంతకీ మీరు ఎన్ని ఇస్తున్నారు..ఎన్ని తీసుకుంటున్నారు..ఇదంతా మనలాంటి సింగిల్స్ కు చాలా చిరాకుగా ఉంటుంది కదా..అసలు లవరే లేదురా అంటే..మళ్లీ ఎన్ని గులాబీలు ఇస్తున్నామంట..వచ్చే ఏడాదికైనా..సింగిల్ లైఫ్ కు గుడ్ బాయ్ చెప్పాలని మీరే ఆ దేవుడిని కోరుకుంటూ ఎన్నో కన్ని గులాబీలు ఇచ్చేయండి బాస్..!
  • -Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news