ఇప్పుడు అంతా డిజిటల్ ఇండియా అయిపోతుంది. ఛాయ్ వాలానుంచి మల్టీప్లక్స్ వరకూ అందరూ డిజిటల్ పేమెంట్స్ కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎందుకంటే చిల్లర లొల్లి ఉండదు ఫస్ట్. సమయం వృథా కాదు. వాళ్లు ఇచ్చే క్లూఆర్ కోడ్ ని స్కాన్ చేయటం ద్వారా నిమిషాల్లో నగదు చెల్లించవచ్చు. రోజులో చాలాసార్లు ఇలాంటి క్లూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తాం..కానీ ఎప్పుడైనా ఆ కోడ్ ని గమనించారా..అందులో మూడు స్క్వేర్ బాక్స్ లు ఉంటాయి. క్యూర్ ఆర్ కోడ్ అంటే పూర్తి అర్థం.క్విక్ రెస్పాన్స్ కోడ్. దీనిని మొదట వాహనాలను ట్రక్ చేసే ఉద్దేశంతో జపనీస్ ఆటోమెటిక్ కంపెనీ 1994 కనిపెట్టిందట.
బార్ కోడ్ కంటే క్యూర్ కోడ్ ను త్వరగా ట్రాక్ చేయవచ్చు. QR కోడ్ ఉద్దేశం ఏంటంటే..మీ ఫోనులో ఎలాంటి వెబ్ చిరునామాలు, టైప్ చేయకుండా వెబ్ సైట్ ను సులభంగా యాక్సెస్ చేయటం కోసం కెమెరా వంటి ఇమేజింక్ పరికరాలకు దీన్ని అనుమతించేలా తయారుచేశారు. అయితే క్యూఆర్ కోడ్ లో వివిధ భాగాలు ఉంటాయి.
అవేంటంటే:
1. క్వైట్ జోన్
2. ఫైండర్ ప్యాట్రన్
3. అలైన్మెంట్ ప్యాట్రన్
4. టైమింగ్ ప్యాట్రన్
5. వెర్షన్ ఇన్ఫర్మేషన్
6. డేటా సెల్స్
ఫైండర్ ప్యాట్రన్ జోన్ లోనే ఈ మూడు స్క్వేర్ బాక్స్ లు ఉంటాయి. వీటివల్ల క్యూఆర్ కోడ్ ను మన డివైజ్ వేగంగా చదవగలుగుతుంది. అది రివర్స్ లో ఉన్నాకూడా మనం స్కాన్ చేసినప్పుడు ఈజీ గా చదివేస్తుంది. అందుకే మనం జస్ట్ అలా మన ఫోన్ స్కానర్ ని కోడ్ కి చూపిస్తే వెంటనే స్కాన్ అవుతుంది. ఈ మూడు స్క్వేర్ బాక్స్ కోడ్ యొక్క ధోరణి, పరిమాణం మరియు చేరాల్సిన గమ్యాన్ని గుర్తించడానికి దోహదం చేస్తాయి. ఒకవేళ నాలుగు స్క్వేర్ బాక్స్ లు నాలుగు వైపులా ఉంటే అప్పుడు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం కష్టతరమవుతుంది. అందుకే, మూడు బాక్స్ లు ఉండి.. రెండు పైనా, ఒకటి కింద డిజైన్ చేయబడ్డాయట. ఈసారి మీరు ఎప్పుడైనా స్కాన్ చేసేప్పుడు గమనించండి.
-Triveni Buskarowthu