బీమ్లా నాయక్ నుంచి బిగ్ అప్డేట్ : సెకండ్‌ సింగిల్‌ ప్రోమో రిలీజ్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరియు హీరో దగ్గుబాటి రానాతో కలిసి మల్టీస్టారర్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళం లో సూపర్‌ హిట్‌ అయిన… అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ సినిమాను పవన్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో పవన్‌ కళ్యాణ్‌ అలరిస్తుండగా… రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్‌ గా రానా కనిపించనున్నాడు.

అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. దసరా పండుగ నేపథ్యం లో ఈ సినిమాలోని “అంత ఇష్టం” అనే సాంగ్‌ ప్రోమో ను విడుదల చేసింది చిత్ర బృందం. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ పాటకు సంగతీ దర్శకుడు థమన్‌ అందించిన మ్యూజిక్‌ అద్భుతంగా ఉంది. ఇక ఈ ఫుల్‌ సాంగ్‌ రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది చిత్ర బృందం. కాగా…ఈ సినిమా జనవరి 12 న విడుదల కానుంది.