టాలీవుడ్ (tollywood) ఇండస్ట్రీలోకి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. అయితే అందులో కొందరు మాత్రమే అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేస్తుంటారు. ఇక స్టార్ హీరోల కుటుంబాల నుంచి కూడా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన వారు కూడా ఉన్నారు. ఇక ఎలాంటి సపోర్టు లేకుండా కష్టపడి పైకి వచ్చిన ఉద్దండులు కూడా ఎంతో మంది ఉన్నారనే చెప్పాలి.
ఇక టాలీవుడ్లోనే ప్రముఖమైన నందమూరి కుటుంబం నుంచి వచ్చిన నటుడు కళ్యాణ్ చక్రవర్తి గురించే చాలా మందికి తెలియదు. ఈయన నటసార్వభౌమ నందమూరి తారక రామారావుకి స్వయానా తమ్ముడు అయిన త్రివిక్రమ రావు కొడుకుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఈయన 1986 సంవత్సరంలో కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన అత్తగారు స్వాగతం అనే మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఆతర్వాత కూడా మారణహోమం అలాగే రౌడీ బాబాయ్ దాంతో పాటు ప్రేమ కిరీటం లాంటి సినిమాలను చేసి సత్తా చాటారు.
ఇక ఆయన చివరగా 2003లో వచ్చిన కబీర్ దాస్ మూవీలో నటించారు. కానీ ఆ తర్వాత తెరకు దూరమయ్యారు. ఇందుకు ఆయన కొడుకు పృథ్వి రోడ్ ప్రమాదంలో చనిపోవడం ఒక ఎత్తయితే తన తండ్రి, తమ్ముడు అదే ప్రమాదంలో మరణించడంతో ఆయన ఆ షాక నుంచి కోలుకోలేక తెలుగు తెరకు దూరమయ్యారని తెలుస్తోంది.