కాఫీ తాగితే నిద్ర ఎందుకు రాదో తెలుసా..?

-

చాల మందికి ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీ తాగనిదే ఏ పని చేయాలి అనిపించని వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాదు.. నైట్ ఔట్ చేసి చదువుకోవాలనుకున్నా లేదా రాత్రి సమయంలో వర్క్ చేయాలనుకున్నా.. నిద్ర వస్తూ ఇబ్బంది పెడుతుంటుంది. ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కాసేపు కునుకు తీయాలన్న కోరిక మాత్రం తగ్గదు. ఇలాంటప్పుడే చాలామంది కాఫీ లేదా టీ తాగుతుంటారు. దీని వలన నిద్రకు సులభంగా చెక్ పెట్టవచ్చు. ఇలా కెఫీన్ తీసుకొని నిద్ర రాకుండా చేయడం వల్ల ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? అని చాలామంది అనుకుంటుంటారు. దీనికి సమాధానాన్ని కనుక్కున్నారు నిపుణులు..

coffee
coffee

అయితే నిద్రపై కెఫీన్ ప్రతికూల ప్రభావాలను అర్థం చేసుకోవడానికంటే.. ముందు నిద్రను అరికట్టడంలో కెఫీన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. కేంద్ర నాడీ వ్యవస్థలో అడెసినోసిన్ రిసెప్టార్స్ లేదా పీ1 రిసెప్టార్స్ అని పిలిచే న్యూరోమాడ్యులేటర్ ఉంటుంది. నిద్ర రావడానికి కారణం ఇదే. అయితే కెఫీన్ ఈ పీ1 రిసెప్టార్స్ పై ప్రభావితం చూపి అడెనోసిన్ ను అడ్డుకుంటుంది. దీని ఫలితంగా మనకు నిద్ర రాకుండా ఉంటుందన్నమాట. కెఫీన్ కొంత మేరకు తీసుకుంటే ఫర్వాలేదు. కానీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి ఇది హానికరంగా మారుతుంది. పరిమితి లేకుండా కెఫీన్ తీసుకోవడం వల్ల స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

కాఫీలో కెఫీన్ అధికంగా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఇన్ సోమ్నియా(నిద్రలేమి) లాంటి ఇబ్బందులు వేధిస్తాయి. అంతేకాకుండా ఆందోళన, కెఫీన్ డిపెండెన్స్ లాంటి సమస్యలకు ఈ కెఫీన్ కారణమవుతుంది. దీనిపై అధికంగా ఆధారపడటం వల్ల పగటిపూట తలనొప్పి, ఒత్తిడి, విశ్రాంతి లేక శరీరం సహకరించకపోవడం లాంటి సమస్యలు స్పష్టంగా కనిపిస్తాయి.

ఇక సాధారణ లేదా ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తి కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. ఆరోగ్యకరమైన నిద్రకు ఉపక్రమించడం వల్ల జీవనశైలిని సరైన క్రమంలో ఉంటుంది. ఇదే సమయంలో శరీరం డీహైడ్రేట్ కాకుండా మితంగా కెఫీన్ తీసుకోవాలి. నాణ్యమైన, తగినంత నిద్రపోయినప్పుడు ఏకాగ్రత పెరుగుతుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు పూర్తి శ్రద్ధతో, చురుకుగా పూర్తి చేస్తారు. ఫలితంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా జీవితంలోనూ విజయం సాధిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news