కరోనా నుంచి కోలుకున్న తర్వాత మీరు టూత్ బ్రష్‌ను ఎందుకు మార్చాలో తెలుసా..?

-

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి జరుగుతోంది. ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా నియంత్రణలో టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నప్పటికీ .. నిపుణులు అన్ని తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. టీకా వేసుకున్నంత మాత్రానా పరిస్థితులు ఒకేలా ఉండవని, మన జాగ్రత్తలో మనం ఉండాలని సూచిస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. అయినా వీరిలో చాలా మంది మళ్లీ కరోనా సంక్రమించింది. దీని వెనుక గల కారణాన్ని పరిశోధకులు గుర్తించారు. కోవిడ్-19 నుంచి కోలుకున్న వ్యక్తులు వెంటనే వారి టూత్ బ్రష్‌ను మార్చాలని దంత వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల కరోనా వైరస్ తిరిగి సంక్రమించే అవకాశాలు ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. కరోనా సమయంలో వారు వాడిన ప్రతి వస్తువును మూటకట్టి బయట పడేయాలని.. లేదా కాల్చివేయాలని చెబుతున్నారు. ఒకవేళ ఆ వస్తువులను తిరిగి వాడితే.. మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కరోనా వ్యాప్తం చెందే ప్రమాదం ఉందన్నారు. ఈ ఏడాది జనవరిలో బ్రెజిల్ పరిశోధకులు కోవిడ్-19 వ్యాప్తిపై నోటి పరిశుభ్రత ప్రభావం ఎంత ఉంటుందనే విషయంపై అధ్యాయనం చేశారు. కరోనా బాధితులు, ప్రజలు నోటి శుభ్రత విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

టూత్ బ్రష్
టూత్ బ్రష్

న్యూఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ డెంటల్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ ప్రవేష్ మెహ్రా కరోనా బాధితులు కరోనా నుంచి కోలుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. వైరస్ బారిన పడి కోలుకున్న తర్వాత కచ్చితంగా టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ మొదలైన సామగ్రిలు వెంటనే మార్చాలని తెలిపారు. వీటిపై వైరస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. కరోనా నుంచి కోలుకుని మళ్లీ అవే సామన్లు వాడితే.. మళ్లీ కరోనా వచ్చే ప్రమాదం ఉందన్నారు. నెగ్లెట్ చేయకుండా కరోనా సమయంలో వాడిన ప్రతి వస్తువులను మూటకట్టి పూడ్చివేయాలని తెలిపారు.

ఆకాష్ హెల్త్‌కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ (డెంటల్) డాక్టర్ భూమికా మదన్ మాట్లాడుతూ.. సీజనల్ పరంగా వచ్చే ఫ్లూ, దగ్గు, జలుబు వంటి వ్యాధుల నుంచి కోలుకున్న వారు ఎవరైనా తమ టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ వాడాలని సూచించారు. కోవిడ్ బాధితులకు ఇదే సలహా ఇస్తున్నామన్నారు. కరోనా బారిన పడినప్పుడు వాడిన టూత్ బ్రష్, టంగ్ క్లీనర్‌ను క్యూర్ అయ్యాకా మార్చాలని తెలిపారు. ఈ టూత్ బ్రష్‌పై బ్యాక్టీరియాలు, వైరస్ ఉంటాయని, ఇవి మళ్లీ మన శరీరంలో ప్రవేశించే అవకాశాలు ఉంటాయన్నారు. నోటిలో ఉండే బ్యాక్టీరియాలపై జాగ్రత్తగా ఉండాలని.. తరచూ మౌత్ వాష్ చేస్తుండాలని తెలిపారు. నోటి శుభ్రతకు రోజూకి రెండు సార్లు బ్రెష్ చేసుకోవాలన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. దగ్గు, తుమ్ము, మాట్లాడటం, అరవడం, నవ్వడం వల్ల నోటిలోనుంచి వైరస్ చిన్న చిన్న బిందువుల రూపంలో గాలిలో వ్యాపిస్తుంది. దీని వల్ల పక్కన ఉండే వ్యక్తికి ఇది వ్యాప్తి జరుగుతుందన్నారు. కలుషితమైన చేతులను నోరు, కళ్లు, ముక్కుకు తాకొద్దన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news