బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ దగ్గర సోషల్‌ మీడియా జాబ్‌ చేస్తారా..? జీతం ఎంతంటే..?

-

మీరు సోషల్‌ మీడియా మేనేజరా ? అందులో బాగా నైపుణ్యం ఉందా..? అన్ని రకాల సోషల్‌ సైట్లు, యాప్‌లను మేనేజ్‌ చేయగలరా..? అయితే ఈ అవకాశం మీ కోసమే. బ్రిటన్‌ రాజ కుటుంబంలో సోషల్‌ మీడియా మేనేజర్‌ పోస్టు ఖాళీగా ఉంది. ఈ మేరకు ఆ కుటుంబానికి చెందిన వెబ్‌సైట్‌తోపాటు వారి లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌లోనూ వివరాలను ఉంచారు. ఔత్సాహికులు ఆ జాబ్‌కు దరఖాస్తు పెట్టుకోవచ్చు.

do you want job at queen elizabeth as social media manager check this out

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ వద్ద ఖాళీగా ఉన్న హెడ్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఎంగేజ్‌మెంట్‌ జాబ్‌లో భాగంగా ఆమెకు చెందిన సోషల్‌ ఖాతాలను మేనేజ్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే సోమవారం నుంచి శుక్రవారం వరకు వారంలో 5 రోజుల పాటు పని ఉంటుంది. వారానికి సుమారుగా 37.5 గంటల పాటు పనిచేయాలి. ఇక నిత్యం లంచ్‌ ఫ్రీ. ఏడాదికిగా 45వేల నుంచి 50వేల పౌండ్లు (దాదాపుగా రూ.42 లక్షల నుంచి రూ.47 లక్షలు) జీతంగా లభిస్తుంది.

ఇక ఈ జాబ్‌కు గాను దరఖాస్తులను సమర్పించేందుకు డిసెంబర్‌ 24వ తేదీ వరకు గడువును నిర్ణయించారు. దరఖాస్తు దారులు జనవరిలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. ఎంపికైతే బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో పనిచేయాల్సి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా సోషల్ మీడియా ఎక్స్‌పర్ట్‌ అయితే.. వెంటనే ఈ జాబ్‌కు దరఖాస్తు పెట్టుకోండి మరి..!

Read more RELATED
Recommended to you

Latest news